YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

చరిత్ర లేకుంటే భవిష్యత్ లేదు.

చరిత్ర లేకుంటే భవిష్యత్ లేదు.

చరిత్ర లేకుంటే భవిష్యత్ లేదు.
విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
కర్నూలు, జనవరి 04 
చరిత్ర లేకుంటే మన భవిష్యత్తు లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం స్థానిక కె.వి.ఆర్  గవర్నమెంట్ మహిళ కళాశాలలో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ 44 వ సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి రాష్ట్రాల నుండి  150మంది ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజివ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచo బ్రహ్మానందరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఆఫీజ్ ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప కిషోర్ రెడ్డి, ఏపీ హిస్టరీ కాంగ్రెస్ ఫౌండర్ ప్రొఫెసర్ రామకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఆర్కియాలజీ సంబంధించిన విలువ కలిగినవి, తెలంగాణలో నిలిచిపోయాయిని, అవి తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. చరిత్ర సంపద తీసుకురావడంతో పాటు పూర్వ వైభవం తీసుకు వచ్చేలా చూస్తామన్నారు. ఆర్థికపరంగా సెమినార్లు నిర్వహించడానికి తదితర వాటికి ఏపీ హిస్టరీ కాంగ్రెస్ కు తమ ప్రభుత్వం సహకరిస్తుంది అన్నారు. చారిత్రక అధ్యయనాలను ప్రోత్సహించడం, చరిత్ర పరిశోధనా కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉన్నారు. శాస్త్రీయ చరిత్ర రచనకు పునాదులు వేయలన్నారు. చరిత్రతో ముడిపడి ఉన్న ఇలాంటి సదస్సును విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అలాగే కర్నూలు ఎంపీ డాక్టర్ సంజివ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచo బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ1866-67లో రాయలసీమను డొక్కల కరువు కబళించినప్పుడు ఈ ప్రాంతంలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు నిర్మించిన కర్నూలు-కడప కాలువ (కెసి కెనాల్‌) కూడా చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. అలాగే చరిత్ర కాంగ్రెస్‌లో ప్రాచీన ఆంధ్రచరిత్ర, పురావస్తు శాస్త్రం అనే అంశంపై చెన్నైకి చెందిన ప్రొఫెసర్‌ శాంతిపప్పు, మధ్యయుగ ఆంధ్రచరిత్ర అనే అంశంపై హైదరాబాదుకు చెందిన ఆచార్య రేఖాపాండే, కలకత్తా చెందిన ప్రొపసర్ శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ భాస్కర్ మూర్తి, కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేశ్వరి, అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌ రాజ్యలక్ష్మి, ఇందిరా శాంతి, రెడ్డి ప్రసాద్‌, కే.సుందరం పాల్గొన్నారు.

Related Posts