YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

భారీగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు

భారీగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు

భారీగా పెరిగిన ఆర్టీసీ చార్జీలు
హైద్రాబాద్, జనవరి 4,
ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం ప్రయాణ ఛార్జీలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 3 నుంచి కిలో మీటరుకు 20 పైసల చొప్పున ఛార్జీలు పెంచారు. దీనికి తోడు చిల్లర సమస్య రాకుండా గతంలో అవలంబించినట్లుగా రౌండ్ ఫిగర్ ఛార్జీలుగా సవరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు చెల్లిస్తున్న ఛార్జీ తడిసి మోపెడవుతోంది. ఆర్టీసీ అధికారుల అనాలోచిత చర్య వల్ల టిక్కెట్ ధర మరీ ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తున్న రూపాయి సెస్సును అధికారులు వేరుగా చూపటంతో ఇప్పుడు ప్రయాణికులు రూ.4 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తున్నట్లు సమాచారం.ఉదాహరణకు, ఛార్జీలు పెంచాక రూ. 52 అయిన ధరను చిల్లర సవరణలో భాగంగా రూ.55 చేశారు. ఒకవేళ పెంచిన ధరే రూ.55 అయితే ఏ సవరణ చేయలేదు. అయితే, రూ.56, రూ.57 అయిన దాన్ని రౌండ్ ఫిగర్ చేసి రూ.60కి పెంచారు. ఇందులో రూ.1 సెస్సు, టోల్ గేట్లు ఉంటే రూ.5 అదనం. ఇటీవల వరకు ఆ విధానం అమలులో ఉంది. గత నెల నుంచి వసూలు చేస్తున్న సెస్సు ఒక రూపాయిని వేరు చూపించటంతో సమస్య తలెత్తింది. ఉదాహరణకు నిర్మల్ నుంచి ఇచ్చొడకు పెంచిన ఛార్జీ రూ. 50. దానికి టోల్ గేట్ ఛార్జీ రూ.5 కలిపితే రూ.55 అవుతుంది. కానీ అధికారులు రూ.1 సెస్సును వేరుగా చూపటంతో టిక్కెట్ ధర రూ.56 అయ్యింది. దీనివల్ల చిల్లర సమస్య తలెత్తుతుంది కాబట్టి, ఆ మొత్తాన్ని రూ.60కి రౌండ్ ఫిగర్ చేశారు. దీనివల్ల ప్రతి ప్రయాణికుడు అదనంగా రూ.4 చెల్లించాల్సి వస్తోంది. ఎక్కువ శాతం చోట్ల ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు సమాచారం. కండక్టర్లను ప్రశ్నిస్తే తామేమీ చేయలేమని చెబుతున్నారని ప్రయాణికులు అంటున్నారు. ఛార్జీలు పెంచి నెల రోజులు అవుతున్నా ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అంటున్నారు

Related Posts