YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 శ్రీకాకుళం  ఉప్పు రైతుల కష్టాలు

 శ్రీకాకుళం  ఉప్పు రైతుల కష్టాలు

 శ్రీకాకుళం  ఉప్పు రైతుల కష్టాలు
శ్రీకాకుళం, జనవరి 5,
 శ్రీకాకుళం జిల్లాలో ఉప్పు రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఉప్పు రైతులు రాత్రింబవళ్లు కష్టపడినా తీరని కష్టాలతో.. ఉప్పుసాగు తగ్గుముఖం పట్టింది.నవరుచుల తల్లి నౌపడ ఉప్పు. శ్రీకాకుళం జిల్లాలో నౌపడ ఉప్పుకు పెట్టింది పేరు. బ్రిటీష్ కాలం నుండి ఉప్పు తయారీకి ప్రసిద్ది గాంచింది. ప్రతీ ఏడాది డిసెంబరు నుండి జూన్ వరకు ఉఫ్పు పంటను రైతులు ఎక్కవుగా సాగుచేస్తారు. ఈ ఉప్పు పంటకు తగినంత ధర లేకపోవటంతో రైతులు ఉప్పు పంట వేయటానికి వెనుకంజ వేస్తున్నారు. గతంలో సుమారు 5వేల 5వందల ఎకరాలు ఉప్పు పంట సాగుచేసేవారు. అటువంటింది ప్రస్తుతం నౌపడ చుట్టుప్రక్కల గ్రామాలలో సుమారు 2వేల500 ఎకరాలు కూడా సాగుచేయలేని పరిస్థితి ఉందంటే ఉప్పుపంటకు ఆదరణ తగ్గిందనే చెప్పవచ్చు.జిల్లాలో ఉప్పు పంటను పండించాలంటే  శ్రమతో కూడిన విషయం. చాలా మంది ఈ ఉప్పుపంట వలన అనుకున్నంత ఆదాయం లేకపోవడంతో ఇతర మార్గాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రతీ ఏటా విస్తీర్ణత తగ్గుముఖం పడుతుంది. ఒక వైపు ఉప్పుకు ధరలేకపోవడం మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో ఉప్పు రైతులకు కష్టాలు తప్పడం లేదు. అదే ప్రకృతి సహకరిస్తే ఉప్పుపంట 20 రోజులకే ఒక పంటచొప్పున వస్తుంది. అలాగే ఆరునెలల్లో 8 సార్లు పండించవచ్చు.జిల్లాలో ఉప్పుపంట 50 కేజీల బస్తా 75 రూపాయలు పలికేది. ప్రస్తుతం ఉప్పు మార్కెట్లలో కేజీ 2 రూపాయాలుకు ధర పలుకుతుంది. ఈ ప్రాంతంలో ఉప్పు తయారీ కోసం నీటిని తోడేందుకు ఆయిల్ ఇంజన్లు పైనే రైతులు ఆధారపడుతున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో డీజిల్ పెట్టుబడులు అమాంతంగా పెరగడంతో ఉప్పుకు గిట్టుబాటు కాని పరిస్థితులు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఉప్పు పరిశ్రమలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. దీంతో ఉప్పు పంటకు గిట్టుబాటు కాక కొందరు రైతులు ఈ సాగునుంచి తప్పుకోగా, మరికొందరు రైతులు ఇతర పనులవైపు దృష్టిసారిస్తున్నారు.రాష్ట్రప్రభుత్వం నౌపడ ఉప్పు పరిశ్రమల రైతు కష్టాల గోడును దృష్టిలో పెట్టుకొని ఉప్పు పరిశ్రమలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తే ఉప్పు రైతుల కష్టాలు గటెక్కుతాయి. రాజం రోడ్లకు మహర్ధశ శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికంగా పేరుపొందిన రాజాం ప్రాంతం. ఇరుకు రోడ్ల పెద్ద సమస్య.  చుట్టుప్రక్కల ఎనిమిది మండలాలకు వాణిజ్య కేంద్రంగా, నిత్యం లక్షలాది మందికి తమ వ్యాపార అవసరాలకు, ఆరోగ్య పరంగా రాజాం పట్టణంకు రావాల్సిందే అంతే కాదు వచ్చారంటే పట్టణ రోడ్లపై ఇరుక్కుపోవాల్సిందే. ఇప్పుడు పరిస్థితి మారింది. రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం కావటంతో చిరకాల వాంఛ నెరవేరబోతుంది. శ్రీకాకుళం జిల్లా రాజాంను గత కొన్నిసంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న ట్రాఫిక్ సమస్య ఎట్టకేలకు తీరనుంది. అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులు, ఆక్రమణ గృహాలను తొలగించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నగర పంచాయతీ అధికారులు ప్రత్యామ్నయ ఏర్పాట్లతో పాటు, తొలగించిన శిథిలాలను కేవలం రాత్రి సమయాల్లోనే తరలిస్తూ.. ప్రజల మన్ననలు పొందుతున్నారు అధికారులు. రాజాం రోడ్లు విస్తరణను ప్రతిష్ణాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం. ఇటు జిల్లా అధికారుల నుంచి అటు మంత్రుల వరకూ రోడ్డు విస్తరణకోసం దృష్టి సారిస్తున్నారు.రోడ్ల విస్తరణపై ఒకరిద్దరు కోర్టును ఆశ్రయించినా... వాళ్లను ఒప్పించి ప్రజల ఇబ్బందులు చెప్పి... త్వరగా విస్తరణతో పాటు వాటి అభివృద్ధి పూర్తి చేయడానికి... రాజాం పట్టణంను సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. రోడ్డు విస్తరణే లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు  రోడ్డు పనులు పూర్తి చేసినంతవరకూ విశ్రమించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికి వాటన్నింటినీ అధిగమించి ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.

Related Posts