YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ముళ్లకంపపై మహరాష్ట్ర సర్కార్ దినదినగండం నూరేళ్ల ఆయుష్షు

 ముళ్లకంపపై మహరాష్ట్ర సర్కార్ దినదినగండం నూరేళ్ల ఆయుష్షు

 ముళ్లకంపపై మహరాష్ట్ర సర్కార్
దినదినగండం నూరేళ్ల ఆయుష్షు
ముంబై, జనవరి 6
మహారాష్ట్రలో కూటమి సర్కార్ కు ఎప్పుడైనా ముప్పు వాటిల్లే అవకాశముంది. అసలే మంత్రి వర్గ విస్తరణతో అసంతృప్తులు చెలరేగి పార్టీలు సతమతమవుతుంటే కొత్తగా పార్టీల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. సావర్కర్ వివాదం కాంగ్రెస్, శివసేనల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయి. కాంగ్రెస్ సావర్కర్ విషయంలో అవలంబిస్తున్న వ్యవహారశైలిని శివసేన బహిరంగంగానే తప్పుపడుతోంది.ఇటీవల కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ లు కలసి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన సేవాదళ్ విడుదల చేసిన ఒక పుస్తకం వివాదాస్పదమయింది. ఇందులో సావర్కర్ ను వ్యంగంగానూ, విమర్శనాత్మకంగానూ చేసిన వ్యాఖ్యలను శివసేన తీవ్రంగా పరిగణిస్తోంది. వీర సావర్కర్ వీరత్వం ఎంత? అంటూ ప్రవ్నించడంపై కాంగ్రెస్ పార్టీపై శివసేన మండిపడుతోంది.మధ్యప్రదేశ్ లో సేవాదళ్ ఒక పుస్తకం విడుదల చేసింది. ఈ పుస్తకంలో సావార్కర్, నాథూరాం గాడ్సే ల మధ్య శారీరీక సంబంధం ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా కొన్ని కఠినమైన వ్యాఖ్యలు కూడా ఈ పుస్తకంలో చేయడం విశేషం. సావర్కర్ అండమాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత బ్రిటీష్ ప్రబుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలను ఈ పుస్తకంలో ముద్రించింది. దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నోటిని, చేతిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సావర్కర్ వీరత్వం గురించి వారికేమి తెలుసునని కటువుగా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో సావర్కర్ అంటే అభిమానం, గౌరవం ఉంది. సావర్కర్ ను కాంగ్రెస్ అగౌరవపరిస్తే అది పరోక్షంగా శివసేనకు దెబ్బే అవతుంది. అందుకే గతంలోనూ రాహుల్ గాంధీ నేనేమీ రాహుల్ సావర్కర్ ను కాదు, రాహుల్ గాంధీని అంటూ చేసిన వ్యాఖ్యలను కూడా అప్పటికప్పుడే శివసేన ఖండించింది. ఈ వివాదం సద్దుమణగకముందే కాంగ్రెస్ మరోసారి సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పుస్తకం విడుదదల చేయడంపై శివసేన అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరి సావర్కర్ కొట్లాట ఎంతవరకూ వెళుతుందో చూడాలి.
శివసేనలో అసంతృప్తి
సంకీర్ణ సర్కార్ అంటే అంతే. నిత్యం కుంపటి మీద కూర్చుని పాలన చేయాల్సిందే. బాసిజం, కుటుంబ పెత్తనం కూడా ఉన్న శివసేన దీనికి అతీతం కాదు. శివసేనలో ఇప్పటికే మంత్రి పదవులు దక్కని వారు అసంతృప్తికి లోనయ్యారు. శివసేనలో సీనియర్ నేతగా ఉన్న సంజయ్ రౌత్ కూడా తన సోదరుడికి మంత్రిపదవి దక్కలేదన్న కోపంతో ఉన్నారు. ఆయన శివసేనకు దూరం కాకపోయినప్పటికీ కొంత అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన శివసేన సభ్యుడు తన పదవికి రాజీనామా చేయడం నిజంగా సంచలనం కల్గించే విషయమే. మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ జరిగి దాదాపు వారం అవుతుంది. మంత్రివర్గాన్ని అయితే విస్తరించారు కాని శాఖల కేటాయింపు మాత్రం జరగలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ముఖ్యమైన శాఖల కోసం కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు పట్టుబడుతున్నాయి. కేవలం మంత్రిపదవికోసమే తాము కేబినెట్ లో చేరలేదని, కీలక శాఖలను దక్కించుకుని తమ పార్టీని బలోపేతం చేయాలన్నదే తమ లక్ష్యమని ఇటు కాంగ్రెస్, అటు ఎన్సీపీలు పట్టుబడ్డుతున్నాయి కేబినెట్ విస్తరణ జరిగినప్పటికీ శాఖల కేటాయింపు జరగలేదు. దీంతో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనికి కారణం ఆయనకు శాఖ కేటాయించక పోవడమే. మంత్రిగా ప్రమాణం చేసినా ఫలితం లేదని, శాఖలేని మంత్రిగా ఎన్నాళ్లు కొనసాగాలని అబ్దుల్ సత్తార్ ప్రశ్నిస్తున్నారు. అబ్దుల్ సత్తార్ ఆషామాషీ నేత కాదు. మంత్రివర్గంలో ఉన్న ఏకైక ముస్లిం మంత్రి ఆయన.అబ్దుల్ సత్తార్ సిల్లోద్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అబ్దుల్ సత్తార్ మంత్రిగా పనిచేశారు. ఆయన బీజేపీలోకి వెళ్లాలనుకున్నా టిక్కెట్ నిరాకరించడంతో చివరి నిమిషంలో బీజేపీలో చేరి విజయం సాధించారు. అబ్దుల్ సత్తార్ రాజీనామాతో శివసేన షేక్ అయిందనే చెప్పాలి. ఒకవైపు మంత్రి పదవులు దక్కని వారిని బుజ్జగించడం ఎలా అని తలపట్టుకున్న సమయంలో సత్తార్ రాజీనామా సేనానికి చికాకు కల్పిస్తుంది.

Related Posts