వాహానాలకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్
హైద్రాబాద్, జనవరి 6,
హికల్ ఫ్యాన్సీ నంబర్ల ఎలాట్‌మెంట్ త్వరలో ఆన్‌లైన్ కానుంది. వారం, పది రోజుల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇది అమల్లోకి వస్తే బ్రోకర్ల ప్రమేయం తగ్గడంతోపాటు పారదర్శకత పెరగనుంది. ఇప్పుడున్న మాన్యువల్ విధానంలో ఫ్యాన్సీ నంబర్ కావాలంటే ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరగాలి. ఆ తీరిక లేక చాలా మంది బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. అయినా కావాలనుకున్న నంబర్ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. ఎప్పటికప్పుడు ప్రారంభమయ్యే కొత్త సిరీస్‌లోని కొన్ని ఫ్యాన్సీ నంబర్లను అధికారులు పక్కకు తీసి ఆర్టీఏ ఆఫీస్‌లో డిస్‌ప్లే చేస్తారు. వాటినే ఆర్టీఏ వెబ్‌సైట్‌లో ఉంచుతారు. నంబర్ డిమాండ్‌ను బట్టి ప్రైస్ ఉంటుంది. నంబర్ కావాలనుకున్న వాళ్లు అధికారులు డిసైడ్ చేసిన ప్రైస్ మొత్తానికి డీడీ తీయాలి. ఆ నంబర్‌పై ఒక్కరే డీడీ తీస్తే ఫర్వాలేదు.. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడితే వేలం వేస్తారు. పలుకుబడి ఉన్న వ్యక్తులు నంబర్ కోసం పోటీ పడితే ఏజెంట్లు రంగంలోకి దిగి వేలం లేకుండా సెటిల్ చేస్తారు.ఆన్‌లైన్‌లోనే నంబర్ సెలెక్ట్ చేసుకుని, నెట్ బ్యాంకింగ్‌తో డబ్బులు చెల్లించవచ్చు. దానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఆ బిడ్డింగ్‌లో నంబర్ దక్కకుంటే డబ్బులు రీఫండ్ చేస్తారు. ఎంతమంది అయినా బిడ్డింగ్‌లో పాల్గొనొచ్చు. ప్రతి సిరీస్‌కు నిర్దిష్ట సమయం ఇచ్చి బిడ్స్ క్లోజ్ చేస్తారు. అప్పటి వరకు ఎవరైతే ఎక్కువ బిడ్ వేస్తారో వారికే నంబర్ దక్కుతుంది. ఎవరికి, ఎంతకు ఆ నంబర్ దక్కిందో ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపుల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం టీఎస్ 09 ఎఫ్‌సీ 9999 నంబర్ 9 లక్షలు పలికింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో కీలక నేత ఓ సిరీస్‌లోని ‘9999’ నంబర్‌ను 50 వేలకే దక్కించుకున్నారు. దీంట్లో అక్రమాలు జరిగాయంటూ చర్చ జరిగింది. ఆన్‌లైన్ అమల్లోకొస్తే ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడొచ్చు.