తిరుమలలో ప్రముఖులు
తిరుమల జనవరి 6
వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ వైకుంఠనాథుడు తిరుమల శ్రీవారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరితో పాటు పలువురు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు. రాత్రి రెండు గంటలకు విరామ సమయం దర్శనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పుష్పశ్రీవాణి, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం సురేష్, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, అవంతిశ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, రంగనాథరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డితో శ్రీవారిని దర్శించుకొన్నారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, భాజపా రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహనరావు, తెదెపా సీనియర్ నేత అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, చిన్నరాజప్ప, ఎమ్.ఎల్.సి. డొక్కామాణిక్యవరప్రసాద్, సినీనటులు రాజేంద్రప్రసాద్, సుమలత శ్రీవారిని దర్శించుకొన్నారు.