స్వామి సన్నిధిలో భక్తుల సందడి
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు
కౌతలము జనవరి
ప్రముఖ పుణ్య క్షేత్రము అయిన ఈరన్న స్వామి సోమ వారం వైకుంఠ ఏకాదశి విశేష దినోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కోరిన వారికి కోరికలు నెరవేర్చే కొలిచే కొంగు బంగారం ఈరన్న స్వామి. భక్తుల పాలిట కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్షం స్వామి వారి విశేష దినోత్సవన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారి మూల విరాట్ ను పూలు వెండి ఆభరణాలు తో అలంకరించారు. ఉదయం అరు గంటల సుప్రభాత సేవ నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మంగళ హారతి నిర్యహించరు. ప్రత్యేక రుసుము చెల్లించి అనుమతి పొందిన భక్తుల సమక్షంలో ఎనిమిది నుంచి పది వరకు అవినేటి మండపంలో స్వామి వారికి పంచామృత అభిషేకలు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది వరకు ధ్వజ స్థంభం వద్ద ప్రకరోత్సవాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు. స్వామి వారి దర్శనం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారి దర్శననికి వచ్చిన భక్తలకు నిర్మించిన గదులు విడది భావనలు ఏర్పాటు చేశారు.భక్తులు ఆదివారం రోజు నుండి ముందు గానే వచ్చి విడది చేశారు. సోమ వారం సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణం లో నిద్ర చేశారు.