ఇంకా వీడని రోహిత్ మిస్టరీ
హైద్రాబాద్, జనవరి 6
హైరాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీరు మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. 11 రోజులుగా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన పడుతున్నారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఆమె కోసం ఎంత వెతికినా ఆచూకీ కనుక్కోలేకపోయారు.చాదర్‌ఘట్ ప్రాంతానికి చెందిన రోహిత(34) నానక్‌రాంగూడలోని యాపిల్ ఇండియా సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. 2018లో ఓ వ్యక్తితో వివాహమైనా 13 నెలలకే విబేధాలతో విడిపోయారు. దీంతో మరో ఇద్దరితో కలిసి నానక్‌రామ్‌గూడలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉంటోంది. డిసెంబర్ 26వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోహిల విప్రో సర్కిల్ వద్ద ఆటో ఎక్కినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. అప్పటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె సోదరుడు 27వ తేదీన గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. అయితే రోహిత తన సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను ఇంట్లోనే వదిలివెళ్లడంతో ఆమె ఆచూకీ గుర్తించడం పోలీసులకు సవాల్‌గా మారింది.రోహిత మిస్సింగ్‌పై పోలీసులు ఆమె భర్తను సైతం ప్రశ్నించారు. అయితే 8 నెలల క్రితం రోహిత తనతో మాట్లాడిందని, అప్పటి నుంచి మళ్లీ మాట్లాడలేదని, ఆమెకు సంబంధించిన సమాచారం తనకు తెలియదని అతడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. మరోవైపు రోహిత డిసెంబర్ 23న నుంచి 26 వరకు ఆఫీసుకు కూడా వెళ్లలేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 26న ఆమె ఎక్కడికి వెళ్లిందనే విషయం మిస్టరీగా మారింది. రోహిత ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. మరోవైపు ఆదివారం రోహిత సికింద్రాబాద్‌లోని ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ పుటేజీ సేకరించారు. త్వరలోనే రోహిత మిస్సింగ్ మిస్టరీని చేధిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.