YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని అంశం పై బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుందా?!

రాజధాని అంశం పై బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుందా?!

రాజధాని అంశం పై బీజేపీ సేఫ్ గేమ్ ఆడుతుందా?!
విజయవాడ జనవరి 6    

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు కాకరేపుతోంది. రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది అన్న ఆశాభావం తో సీఎం జగన్ మోహన్ రెడ్డి ..మూడు రాజధానులు అనే ప్రతిపాదికని తీసుకువచ్చారు. అభివృద్ధి అంతా ఒకే చోటు జరిగితే ...మరోసారి కొన్ని జిల్లాలకు అన్యాయం జరిగే అవకాశం ఉండటం తో అభివృద్ధి వికేంద్రీ కరణకు జై కొట్టారు జగన్. దీనిపై అమరావతి ప్రాంత ప్రజలు ..ఏపీ ప్రభుత్వం పై మండి పడుతున్నారు. గత 20 రోజులకి పైగా రాజధాని ప్రాంతంలో అమరావతి నే రాజధానిగా కొనసాగించాలి అని ఆందోళనలు చేస్తున్నారు. అలాగే ఇదే సరైన సమయం అని భావించిన టీడీపీ కూడా రైతులకి మరింత ఉసిగొల్పి ..ప్రభుత్వం పై విరుచుకు పడేలా చేస్తున్నారు. ఈ రాజధాని అంశం పై ఎవరికీ నచ్చిన విధంగా వారు స్పందిస్తున్నారు. కొంతమంది జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు అని స్వాగతిస్తుంటే ..మరికొంతమంది మాత్రం జగన్ ఒక తుగ్లక్ అంటూ ఫైర్ అవుతున్నారు. ఇకపోతే ఇటువంటి సమయం లో రాజధాని రైతులకి రాజకీయ నేతల నుండి కావాల్సింది సరైన మద్దతు కానీ కొందరు నేతలు మాత్రం రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు అయితే కొంతమంది మాత్రం జగన్ నిర్ణయం మంచిది అంటుంటే .... మరి కొందరు అమరావతి లోనే రైతులకి మద్దతుగా ధర్నాలతో పాల్గొంటున్నారు. ఇకపోతే ఈ నేపథ్యం లోనే కొందరు రైతులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలవగా అయన వ్యవహరించిన తీరుని చూస్తే ... బీజేపీ రాజధాని అంశం పై సేఫ్ గేమ్ ఆడుతుందా అని అనిపించక మానదు.పూర్తి వివరాలు చూస్తే .. అమరావతి ప్రాంత రైతులకు న్యాయం చేయాలంటూ కొందరు కేంద్ర హోంశాఖ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సమయంలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా తప్పదు కిషన్ రెడ్డి అన్నారు. అయితే ఇదే సమయంలో అయన మాట్లాడుతూ.. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వము పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచనలు చేయడం కొంచెం చిత్రంగా ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదన మంచిదనే అభిప్రాయం భారతీయ జనతాపార్టీ కి కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే అమరావతి ప్రాంత రైతులు వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం ఇష్టం లేని ఆ పార్టీ… సేఫ్ గేమ్ లో భాగంగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలలో ఏపీలో జగన్ ను ఓడించి అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ ఇలా రాష్ట్రానికి సంబంధించిన ఒక కీలక విషయంలో స్పష్టమైన నిర్ణయం ప్రకటించక పోవడం గమనార్హం. రాజధాని మారుతున్నట్లు గా ప్రభుత్వం కేంద్రానికి తెలియజేస్తే అప్పుడు తమ స్పందన ఏమిటో తెలుపుతాము అని కిషన్ రెడ్డి చెప్పడం చూస్తే సేఫ్ గేమ్ ఆడుతుండన్నది స్పస్టమవుతుంది.

Related Posts