ట్రంప్ వ్యాఖ్యలతో విభేదించిన ఆ దేశ రక్షణ శాఖ
వాషింగ్టన్ జనవరి 7
ఇరాన్ సాంస్కృతిక ప్రదేశాలపై అమెరికా దాడులు చేయడానికి వెనుకాడదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ రక్షణ శాఖ విభేదించింది. వాషింగ్టన్‌లో అమెరికా డిఫెన్స్ సెక్రటరీ మార్క్ ఎస్పర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ తాము యుద్ధ నియమాలకు లోబడే వ్యవహరిస్తామని అన్నారు. ఇరాన్ లోని 52 సాంస్కృతిక ప్రదేశాలపై అమెరికా దాడులు చేస్తుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన సమాధానమిస్తూ అలా చేయడం యుద్ధ నియమాలకు వ్యతిరేకమని, తాము ఎట్టి పరిస్థతుల్లో యుద్ధ నియమాలను ఉలంఘించబోమని స్పష్టం చేశారు.సాంస్కృతిక ప్రదేశాలపై మిలటరీ దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల(1954 హేగ్ కన్వెన్షన్ సాంస్కృతిక ఆస్తుల భద్రత) ప్రకారం నేరంగా పరిగణిస్తారు. ఈ అంశంపై 2017లో ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో జరిగిన రెజ్యలూషన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మద్దతు తెలపడం గమనార్హం.