35 రూపాయిలకు పడిపోయిన ఉల్లి
కర్నూలు, జనవరి 7
కొద్ది నెలలుగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఉల్లిధరలు నేలకు దిగి వస్తున్నాయి. పంట చేతికి అందడం, విదేశాల నుంచి దిగుమతులు పెరగడంతో.. ఉల్లి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. కర్నూలు, రాయచూరులో హోలోసేల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.35కి పడిపోయింది. మహారాష్ట్ర ఉల్లి అందుబాటులోకి రావడంతో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ధరలు తగ్గుతున్న తీరును గమనిస్తే.. ఫిబ్రవరిలో కిలో ఉల్లి రూ.20కే లభ్యమయ్యే అవకాశం ఉంది.దేశవ్యాప్తంగానూ ఉల్లి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం ఆగ్రాలో కిలో ఉల్లి ధర రూ.50 పలికింది. వారాణాసి, మీరట్, పనాజీలతోపాటు తమిళనాడులోని దిండిగల్‌లో ఉల్లి ధరలు కిలోకు రూ.20 మేర తగ్గాయిఈశాన్య రాష్ట్రాల్లోనే కొన్ని చోట్ల ఉల్లిధరలు అధికంగా ఉన్నాయి. దక్షిణాదిలో ఉల్లి రిటైల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. హోల్‌సేల్ ధరలతో పోలిస్తే.. రిటైల్ మార్కెట్లో ధరల తగ్గుదల నెమ్మదిగా ఉంది