YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్,కమ్యూనిస్టులు, సైకిల్ మున్సిపల్స్ లో కొత్త పొత్తులు 

కాంగ్రెస్,కమ్యూనిస్టులు, సైకిల్ మున్సిపల్స్ లో కొత్త పొత్తులు 

కాంగ్రెస్,కమ్యూనిస్టులు, సైకిల్
మున్సిపల్స్ లో కొత్త పొత్తులు 
హైద్రాబాద్, జనవరి 7
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతర రాజకీయ పక్షాలతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీడీపీ, వామపక్షాల నేతలో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా సంప్రదింపులు జరిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణతో ఉత్తమ్, కుంతియా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.అవసరమైన చోట్ల ఆయా పార్టీల మద్దతు కోరగా.. సీపీఐ, సీపీఎం స్థానిక నేతలకే నిర్ణయాధికారం ఇచ్చినట్లు తమ్మినేని, చాడ వెంకట రెడ్డి చెప్పినట్లు సమాచారం. బలంగా ఉన్న మున్సిపాలిటీల్లో టీడీపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని, బలం లేని చోట ఇతర పార్టీలకు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు రమణ స్పష్టం చేశారని తెలుస్తోంది. అయితే, కొన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు కలిసి పని చేసే అవకాశముంది. స్థానిక నాయకుల పరస్పర సంబంధాలపైనే ఈ పొత్తు ఆధారపడి ఉండే అవకాశం ఉంది.2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, టీజేఎస్, వామపక్షాలతో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీఆర్ఎస్‌పై వ్యతిరేకత ఉందని భావించి, మహా కూటమిగా ఏర్పడ్డ తమకే ప్రజలు పట్టం కడతారని యోచించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. అంతకుముందు ఎన్నికల కన్నా అధిక సీట్లు టీఆర్ఎస్ గెల్చుకుంది. కాంగ్రెస్ గెల్చుకున్న స్థానాలు 19కే పరిమితమయ్యాయి. టీడీపీ ఖమ్మం జిల్లాలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెల్చుకుంది. ఇక కూటమిలో ఉన్న టీజేఎస్ మచ్చుకైనా కనిపించలేదు.అయితే, కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే చాలా తక్కువ స్థానాలు సాధించిందన్న విమర్శలు వచ్చాయి. చిరకాల ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్-టీడీపీలు పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు ఆమోదించలేదని స్పష్టమైంది. ఆ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉంటే, కాంగ్రెస్ మరిన్ని స్థానాలు కైవసం చేసుకొని ఉండేదని ఎన్నికల అనంతరం టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఎదురైన తీవ్ర ఎదురుదెబ్బతో ఏపీలో ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీలు వేర్వేరుగానే పోటీ చేశాయి. కానీ, గత సార్వత్రిక ఎన్నికల కోసం జాతీయ స్థాయిలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పని చేయడం గమనార్హం. అయినా, ఇరు పార్టీలకు అక్కడా ఫలితం దక్కలేదు.

Related Posts