ఇంటర్ పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దాం: సీఎస్
హైదరాబాద్ జనవరి 7
ఇంటర్ పరీక్షల నిర్వహణలో లోపాలు సరిదిద్దామని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ. 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. చిన్న తప్పు కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. 3 మెన్ కమిటీ ఇచ్చిన 6 రికమండేషన్స్‌ను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. బీఐజీఆర్ఎస్ యాప్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని సీఎస్ సోమేష్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని పరీక్షలు పకడ్బందీగా జరగాలని సీఎం కేసీఆర్ చెప్పారని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు.