YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మూడు రాజధానులు వద్దు..ఒకే రాజదాని ముద్దు

మూడు రాజధానులు వద్దు..ఒకే రాజదాని ముద్దు

మూడు రాజధానులు వద్దు..ఒకే రాజదాని ముద్దు
రాజధానిని మార్చాలనే యోచనను విరమించుకోవాలి:ఎన్సీపి డిమాండ్
గుంటూరు జనవరి 7
రాజధాని అమరావతిని మార్చాలనే యోచనను విరమించుకోవాలని నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపి)డిమాండ్ చేసింది.”మూడు రాజధానులు వద్దు..ఒకే రాజధాని ముద్దు” అనే నినాదం తో గుంటూరు లో నేషనల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆద్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ కి పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి కే.సరస్వతి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ర్యాలీ ని ఉద్దేశించి సరస్వతి మాట్లాడుతూ రాజధానిని మార్చాలని ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు.జగన్ ప్రతి పక్షం లో ఉన్నపుడు అమరావతి రాజధానికి 30 వేల ఏకరాల భూమి కావాలన్న అప్పటి సిఎం చంద్ర బాబు నిర్ణయాన్ని సమర్దిస్తూ అసంబ్లీ లో ఆమోదం తెలిపి నేడు అధికారం లోకి వచ్చాక మాట మార్చడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.దీని వెనుక సిఎంఅనుయాయులకు బంధుగణానికి  లబ్ధి చేకూర్చాలన్న ఆలోచన తప్ప మరొకటి కాదన్నారు.రాజధానిని మార్చడం కేవలం రాజకేయ దురుద్దేశం తో కూడుకున్నదని సరస్వతి విమర్శించారు..అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కృపా సత్యం మాట్లాడుతూ అమరావతి నుండి రాజథీనిని మార్చవద్దని డిమాండ్ చేశారు. ఒకవేళ ముఖ్య మంత్రికి మూడు రాజధానులు చేయాలన్న యుద్దేశ్యం ఉంటే వెంటనే అసంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించి ప్రజా తీర్పును కోరాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్యదర్శినాంచారయ్య, గుంటూరు డివిజన్ కార్యదర్శి గంగాధర్,సహాయ, జి.వెంకటేష్,మాచర్ల నియోజకవర్గం కార్యదర్శి నారాయణ,గురుజాల డివిజన్ కార్యదర్శి రాజు,వెల్దుర్తి మండల కార్యదర్శి గురువయ్య  యుబిఎస్పీ జాతీయ కన్వీనర్ కరణం తిరుపతి నాయుడు,ప్రదాన కార్యదర్శి వై.శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.

Related Posts