YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి:

జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి:

జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి:
చీఫ్ ఎలక్టోరల్ ఆఫిసర్ డా. రజత్ కుమార్
హైదరాబాద్ జనవరి 7 
జనవరి 25 న గల జాతీయ ఓటరు దినోత్సవాన్ని అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫిసర్ డా. రజత్ కుమార్ అన్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై చీఫ్ ఎలక్టోరల్ ఆఫిసర్ డా. రజత్ కుమార్ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్ల చే వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం పై అవగాహన పెంపొందించుటకు పాఠశాల, కళాశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని అన్నారు. పోటీలను మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించాలని, జిల్లా స్థాయిలో పోటీలలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపించాలని సూచించారు. వివిధ స్థాయి పోటీలలో గెలుపొందిన వారికి జాతియ ఓటర్ల దినోత్సవం రోజున జరుగు కార్యక్రమం లో ముఖ్య అతిధులచే బహుమతి ప్రధానం చేయాలని అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో విధ్యార్థులచే ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రొజున ఓటరు నమోదుపై ప్రజలలో అవగాహన పెంచెందుకు ఓటర్ల కరపత్రాలు, పోస్టర్లు పంపిణి చేయాలని అన్నారు. ఓటర్ల నమోదు స్పెషల్ సమ్మరీ రివిజన్ పకడ్భందీగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఓటరు నమోదు కార్యక్రమాలపై క్యాలెండర్ రూపొందించాలని సూచించారు. ఓటరు నమోదు స్పెషల్ సమ్మరి రివిజన్ పై క్వాటర్లీ నివేదికలు పంపించాలని అన్నారు. 2020 జనవరి 1, వరకు 18 సం.రాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున కొత్తగా నమోదైన యువ ఓటర్లకు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను పంపిణి చేయాలని సూచించారు.

Related Posts