యాచకుడిని చంపిన మరో సైకో యాచకుడు
హైదరాబాద్ జనవరి 07
పాత బస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఒక యాచకుడిని మరో యాచక సైకో దారుణంగా హతమార్చాడు. సైదాబాద్ లోని దోబీఘాట్ చౌరస్తాలో ప్రధాన రహదారి పై యాచిస్తున్న వ్యక్తి పై , ఓ సైకో వ్యక్తి రోడ్డుపై హల్చల్ చేసుకుంటూ వచ్చి మెడకు బట్ట బిగించి అందరూ చూస్తుండగానే దారుణంగా హత్య చేసాడు. స్థానికులు సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సైకో నిందితున్ని అదుపులోకి తీసుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించి దర్యాప్తు చేపట్టారు.