నిర్భయ నిందితులకు 22న ఉరి
న్యూఢిల్లీ, జనవరి 7,
నలుగురు నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఉదయం ఏడు గంటలకు ఉరిశిక్షను అమలుపర్చనున్నారు. తిహార్ జైల్లో నలుగురికి ఒకేసారి ఉరి శిక్షను అమలు చేయనున్నారు. నిర్భయ దోషులకు త్వరగా శిక్ష అమలు చేయాలని ఆమె తల్లి వేసిన పిటీషన్‌కు స్పందనగా.. న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పును నిర్భయ తల్లి స్వాగతించారు. శిక్షపై క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడానికి దోషులకు కోర్టు 14 రోజలు గడువు ఇచ్చింది2012 డిసెంబర్ 16న రాత్రి సమయంలో దక్షిణ ఢిల్లీలో తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన నిర్భయ.. ద్వారకలోని ఇంటికి వెళ్లడం కోసం ఆటో కోసం ఎదురు చూసింది. అదే సమయంలో ఓ ప్రయివేట్ బస్సు వాళ్ల ముందు ఆగింది. అందులోని వ్యక్తులు వారిని దిగబెడతామన్నారు.నిర్భయతోపాటు ఫిజియోథెరపిస్ట్ అయిన అవింద్ర ప్రతాప్ పాండే అనే 23 ఏళ్ల ఆమె స్నేహితుడు ఆ బస్సు ఎక్కారు. అందులో డ్రైవర్‌తోపాటు ఆరుగురు మగాళ్లు ఉన్నారు. కాసేపటి ద్వారా డ్రైవర్ బస్సును దారి మళ్లించారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. అవింద్రను నెట్టేశారు. ఏదో తేడా జరుగుతోందని ఆ ఇద్దరూ గ్రహించారు. బస్సు డోర్ లాక్ చేసిన తర్వాత.. నిర్భయ స్నేహితుడికి.. మద్యం మత్తులో ఉన్న బస్సులోని వ్యక్తులకు మధ్య గొడవ జరిగింది.