YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 కేసులకు అరెస్టులకు భయపడేది లేదు 

 కేసులకు అరెస్టులకు భయపడేది లేదు 

 కేసులకు అరెస్టులకు భయపడేది లేదు 
అమరావతి జ‌న‌వ‌రి 7 
మంగళవారం ఉదయం అమరావతి కోసం ఉద్యమిస్తున్న దేవినేని ఉమా విజయవాడ గద్దె రామ్మోహన్ దీక్ష కు నిమ్మరసం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు ఇంటిలో నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి దేవినేని ఉమాను ఇంటి నుండి బయటకు తీసుకువచ్చారు. ఇంటి వద్ద నుండి గొల్లపూడి లోని దీక్షా స్థలి వద్దకు వచ్చిన దేవినేని మాట్లాడుతూ  పోలీసులను అడ్డం పెట్టుకొని ఉద్యమాలను ఆపలేరని రాజధాని అమరావతి కోసం పోరాడుతున్న వారిని నిరంకుశంగా నిర్వహిస్తూ అరెస్టులు చేస్తున్నారని ఒక్క ఉమాను అరెస్ట్  చేస్తే వందమంది ఉమాలు వస్తారని దేవినేని హెచ్చరించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి కేసులో ముద్దాయిగా కోర్టులలో చేతులు చేతులు కట్టుకుని చేయడం సిగ్గు చేటు అని ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు తలవంపులుగా తలెత్తుకోలేని విధంగా ఉందని దేవినేని అన్నారు. స్వాతంత్ర సమరం కోసమో.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమో..  ప్రజా హక్కుల పోరాటం కోసమో ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్తే గొప్పగా చెప్పుకుంటాం కానీ  అవినీతి కేసుల్లో వెళ్తుoటే సమాజానికి ఏ సందేశం ఇస్తున్నట్లు చెప్పాలని దేవినేని అన్నారు. అమరావతి 29 గ్రామాల సమస్య కాదని ఐదు కోట్ల ఆంధ్రుల ప్రజల సమస్యని అటువంటిది ఉద్యమాన్ని అణచివేయాలని అనాలోచిత నిర్ణయాలతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని దీనికి తగిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటారు అని దేవినేని అన్నారు. అమరావతి కోసం ఉద్యమిస్తుంటే ఇప్పటికే నాలుగు కేసులు నాపై పెట్టారని, అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారని ఈ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని దేవినేని పునరుద్ఘాటించారు. ఓ పక్క అమరావతి కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే మైలవరం శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ గుర్రపు బండ్లపై ఊరేగుతూ రాజధానిని తరలిస్తున్న ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలలో కేకులు కట్ చేస్తూ ఉత్సవాలలో పాల్గొంటున్నాడని రాజీనామాలు చేస్తా రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రజలు ఆందోళనలో ఉన్నప్పుడు నేడు  ప్రజా పక్షం వహించకుండా రాజధాని తరలింపు సమర్థిస్తూ స్వార్ధ ప్రయోజనాలతో వ్యవహరించే ఇటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి అవసరమా అని దేవినేని ప్రశ్నించారు. ఏది ఏమైనా అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని దేవినేని అన్నారు. పోలీసుల సంఖ్య పెంచి తాళాలువేసి తాళ్ళు కట్టి ఉద్యమాలను ఆపలేరని ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్న తమకు సహకరించాలని అక్రమ అరెస్టులను ఆపాలని దేవినేని పోలీసులకు విజ్ఞప్తి చేశారు

Related Posts