YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం తెలంగాణ

భారీ రిజిస్ట్రేషన్లపై ఐటీ  శాఖ కన్ను

భారీ రిజిస్ట్రేషన్లపై ఐటీ  శాఖ కన్ను

భారీ రిజిస్ట్రేషన్లపై ఐటీ  శాఖ కన్ను
వరంగల్‌ రూరల్, జనవరి 8,
స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖ ద్వారా చర, స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. క్రయ విక్రయాల్లో రూ. 30 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కల ఆస్తులపై ఆరా తీయనుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పూర్తి వివరాలను తమకు కావాలని రిజిస్ట్రేషన్ల శాఖకు ఐటీ శాఖ కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గత ఏడాదికి సంబంధించిన పూర్తి వివరాలను ఇటీవల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. అస్తులు కోనుగోలు చేసిన వారితో పాటు అమ్మిన వారి వివరాలను సమగ్రంగా సేకరించారు. ఆస్తులను అమ్మిన వారు ఆదాయ పన్ను చెల్లించారా లేదా కొనుగోలు చేసిన వారు ఎక్కడ నుంచి అంత డబ్బును సేకరించారు, రుణం తీసుకున్నారా, తమ సొంత డబ్బును వినియోగించారా, ఆదాయ పన్ను చెల్లించారా లేదా అనే అంశాలపై ఐటీ శాఖ వాటిపై దృష్టి పెట్టనుంది. అయితే గతేడాదికి సంబంధించిన విలువ ఎక్కువున్న లావాదేవీలపై దస్తావేజులను గత నెల 15 వరకు రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రిజిస్ట్రార్‌కు ఉత్తర్వులను జారీ చేసినట్లు సమాచారం. ఎట్టకేలకు రాష్ట్ర కార్యాలయానికి తగిన సమాచారాన్ని పంపించారు. అయితే ప్రతి సంవత్సరం రూ. 5లక్షల పై విలువ రిజిస్ట్రేషన్ల వివరాలు పంపిస్తామని అధికారులు తెలిపారు. అయితే రూ. 30 లక్షలు మించితే ప్రత్యేక స్టాప్‌వేర్ ద్వారా పంపించాలని వారు తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ఐదు జిల్లాలు కావడంతో నూతన జిల్లాల ఏర్పాటుతో వెంచర్లు, పాట్లు చేయడంతో భూమి విలువ పెరుగుతుందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా బహుళ అంతస్తుల ఇంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారు కూడా కొనుగోలపై దృష్టి సారించారు. పిల్లల చదువు కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు కూడా పట్నం బాట పడుతున్నారు. దీంతో వారు కూడా ప్లాట్లు కొనుగోలుపై దృష్టి పెట్టుతుండడంతో భూమి విలువ పెరుగుతందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పరకాల సబ్ రిజిస్ట్రార్ పరిధిలో గతంలో పరకాల, శాయంపేట, రేగొండ, మొగుళ్ళపల్లి, చిట్యాల, గణపురం, భూపాలపల్లి మండలాలు ఉండేవని ముఖ్యంగా భూపాలపల్లి నుండి ఎక్కువ మొత్తంలో రిజిస్ట్రేషన్ జరిగేవని అధికారులు చెప్పారు. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన జిల్లాగా ఏర్పడడంతో భూపాలపల్లి ములుగు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అనుసంధానం చేసినట్లు వారు తెలిపారు. ఈ దరిమిలా పరకాల రిజిస్ట్రేషన్ పరిధిలో కేవలం పరకాల, శాయంపేట మండలాలు వచ్చాయని, పరకాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో రూ. 30లక్షలకు పై విలువ గల ఆస్తుల రిజిస్ట్రేషన్ చాల తక్కువ అని అయితే ప్రతి సంవత్సరం పంపించడం జరుగుతుందని పరకాల సబ్ రిజిస్ట్రేషన్ పరిధిలో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలు పంపించినట్లు అధికారులు తెలిపారు.

Related Posts