YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం భారత్ పై తీ్వ్ర ప్రభావం

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం భారత్ పై తీ్వ్ర ప్రభావం

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం
భారత్ పై తీ్వ్ర ప్రభావం
కువైట్, జనవరి 8, 
ఇరాక్‌లోని బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్ కీలక సైనికాధికారిని కోల్పోయింది. దెబ్బకుదెబ్బ.. మళ్లీ ఇరాన్ అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడులు చేసింది. దీంతో అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మన దేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.భారత్ ఇప్పటికే గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటోంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటోంది. డిమాండ్ పడిపోయింది. నిరుద్యోగం బాగా పెరిగింది. జీడీపీ పడకేసింది. కేంద్ర ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ఫలితం దక్కడం లేదు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. అగ్రరాజ్యం అమెరికా ఆదేశాల ప్రకారం ఇప్పటికైతే మనం ఇరాన్ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడం లేదు. అయినాకూడా మనకు ఇరాన్ చాలా కీలకమైన దేశమే.గత రెండేళ్లలో ఇరాన్‌తో మనకు వాణిజ్య భాగస్వామ్యం బాగా పెరిగింది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఇరాన్‌కు భారత్ ఎగుమతులు 18 శాతం పెరిగాయి. అదేసమయంలో అక్కడి నుంచి మన దేశానికి దిగుమతులు 20 శాతం పైకి కదిలాయి. కూరగాయలు, చక్కెర, మిఠాయి, జంతువుల పశుగ్రాసం వంటి వాటిని ఎక్కువగా ఎగమతి చేస్తున్నాం. అదేవిధంగా ఆయిల్, కెమికల్స్, ఇంధనం వంటి వాటిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.మోదీ ప్రభుత్వం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా నిర్దేశించుకొని ముందుకు వెళ్తోంది. చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని పేర్కొంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ లక్ష్యం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలో ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు. వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల రూపంలో మనకు మరో అడ్డంకి ఎదురైంది.ఇరాన్ నుంచి మనం క్రూడ్‌ను దిగుమతి చేసుకోకపోయినప్పటికీ అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల భారత్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే క్రూడ్ ధర బ్యారెల్‌కు 70 మార్క్‌ను దాటేసింది. దీంతో మనం దిగుమతి చేసుకునే క్రూడ్ భారం మరింత పెరగనుంది.ఇరాన్ తాజాగా ఇరాక్‌లోని అమెరికా బలగాలపై బాలిస్టిక్ మిసైల్ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో క్రూడ్ ధరలు మరింత పైకి చేరే అవకాశముంది. ఇలాంటప్పుడు భారత్ క్రూడ్ దిగుమతుల భారం మరింత పైకి చేరుతుంది. దీంతో ప్రభుత్వానికి అనుకోని ఖర్చులు పెరిగిపోతాయి. దీంతో కేంద్రం భవిష్యత్ ప్రణాళికల్లో మార్పులు రావొచ్చు. దీంతో ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. అదేసమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగొచ్చు. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోతుంది. ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం కష్టతరం కావొచ్చు.

Related Posts