YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రాజధానిలో మగాళ్లు ఏమైపోయారు

 రాజధానిలో మగాళ్లు ఏమైపోయారు

 రాజధానిలో మగాళ్లు ఏమైపోయారు
విజయవాడ, జనవరి 8, 
రాజధాని మహిళల ఉద్యమంపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఉద్యమంలో మహిళలను పావులుగా వాడుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. విజయవాడలో సత్తాలేని వారే మహిళలతో ఉద్యమం చేయిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళలను రోడ్డుపైకి తెచ్చి ఉద్యమాలు చేయించడమేంటని ప్రశ్నించారు. ఇదేం పౌరుషం.. ఇదేం ఉద్యమం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్న సమయంలోనూ ఇలానే చేశారా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఇప్పటి వరకు పదవులు అనుభవించిన.. పెత్తనం చేసిన మగాళ్లేమైపోయారని వాసిరెడ్డి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఉద్యమం పేరుతో మహిళలను ఎలా వాడుకుంటున్నారో అర్థమవుతోందన్నారు. పదవులు అనుభవించేది మగాళ్లు.. ఉద్యమం పేరుతో మహిళలను రోడ్లపైకి తీసుకువస్తారా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో పదవులు అనుభవించి విర్రవీగిన మగాళ్లేమైపోయారని ఆమె ప్రశ్నించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భూములు కొనుక్కుని పెత్తనం చేసిన మాజీ ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు ఏమయ్యారని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. ఇప్పుడేమో మహిళలను రోడ్డుపై కూర్చోబెట్టి అరెస్టులు అయ్యేలా చేస్తున్నారన్నారు. పదవులు అనుభవించడానికి మగాళ్లు.. ఉద్యమాలు చేసి దెబ్బలు తినడానికి ఆడవాళ్లు కావాల్సి వచ్చారని అని ఆమె తప్పుబట్టారు.మహిళలను రాజకీయ పార్టీలు పావులుగా వాడుకుంటున్నాయని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. మహిళలను ఓటు బ్యాంకుగా చూడడం దారుణమని.. ఉద్యమాల్లో ఆడవాళ్లను ముందుపెట్టి వెనుక దాక్కోవాలని చూడడం నీచ రాజకీయమని.. చిల్లర రాజకీయమని వాసిరెడ్డి పద్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related Posts