జగన్ కు ముందుంది ....
విజయవాడ, జనవరి 9
వైఎస్ జగన్ కు సంక్రాంతి పండగ ముందు సమస్య ఎదురవుతోంది. కొత్త ఏడాది ఆరంభంలోనే జగన్ కు పరీక్షలు మొదలవుతున్నాయి. ఇప్పటికే రాజధాని అమరావతి తరలింపు అంశం పదమూడు జిల్లాల్లో చర్చగా మారింది. కొన్ని చోట్ల అసంతృప్తులు తీవ్రస్థాయిలో తలెత్తుతున్నాయి. మరో నాలుగేళ్లు అధికారంలో జగన్ ఉండనుండటంతో వీటిని చల్లార్చడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కోర్టు సమస్యలతో జగన్ సతమతమవుతారన్నది వాస్తవం.ఈ నెల పదో తేదీన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాక తప్పని పరిస్థిితి. ఇప్పటికే సీబీఐ న్యాయమూర్తి జగన్ గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఏపీ ముఖ్మమంత్రి హాజరుకాక ముందు వరకూ సీబీఐ కోర్టుకు తప్పనిసరిగా హాజరయ్యే వారు. తాను సుదీర్ఘ పాదయాత్ర ఏడాదిన్నర పాటు చేసినప్పటికీ ఏపీలో మారుమూల ప్రాంతంలో ఉన్నా సీబీఐ కోర్టుకు హాజరయ్యే వారు. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టిన తర్వాత సీబీఐ కోర్టు నుంచి మినహాయింపు కోరుతూ హాజరు కావడం లేదు.డు నెలల నుంచి సీబీఐ కోర్టుకు జగన్ హాజరు కావడంలేదు. దాదాపు 11 కేసుల్లో జగన్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ నెల పదోతేదీన మాత్రం జగన్, విజయసాయిరెడ్డిలు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రతి వారం జగన్ కోర్టకు హాజరయితే లక్షల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని జగన్ తరుపున న్యాయవాదుల పిటీషన్ ను సీబీఐ న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ఈ నెల 10వ తేదీన జగన్ ఖచ్చితంగా సీీబీఐ న్యాయస్థానం ఎదుటకు రావాల్సిందే.ఇక అదే రోజు జగన్ కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈనెల పదో తేదీన జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు భారతిలు కూడా న్యాయస్థానం ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించారని వారిపై పరకాల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ నెల పదోతేదీన వారిద్దరూ హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ అయ్యాయి. మరి పదో తేదీన జగన్ కుటుంబం మొత్తం కోర్టులోనే గడపనుంది.