YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ
హైదరాబాద్ జనవరి 09 
తెలంగాణ భవన్ లో  గురువరం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపికలో ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను అయన విన్నారు. మున్సిపాలిటీల వారిగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఎమ్మెల్యేలు.. సీఎం కేసీఆర్ ముందుంచారు. తరువాత ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ వివరించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎం. శ్రీనివాస్రెడ్డి, కేసీఆర్ సమక్షంలో  ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు ఏ, బీ ఫారాలు అందజేసారు. దీంతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లే. ఎక్కువ  పోటీ ఉన్న స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముగిసింది. వారందరినీ నామినేషన్లు వేసుకోవాలని.. ప్రచారాన్ని ప్రారంభించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జీలకు  సూచించారు.  ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం  ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, ఈటల రాజేందర్, నిరంజన్రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. సమయానికి ఎందుకు రాలేకపోతున్నారని కేసీఆర్ అసహనం వ్యక్తం చేసారు. ఇలా ఎందుకు జరిగిందని వారి నుంచి వివరణ తీసుకున్నారు. ఉదయం పదిన్నర గంటలకే తెలంగాణ భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్... అప్పటికీ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు రాకపోవడంపై ఆరా తీశారు. ఇక ఢిల్లీ వెళ్లాల్సి ఉండటంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాత్రం సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు.

Related Posts