పోలవరం ఆపడం దుర్మార్గం
విజయనగరం జనవరి 09
రాష్ట్రంలో గమ్మత్తైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. పోలవరం ఆపడం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆపడం దుర్మార్గం. గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర లో గాని జగన్ పాదయాత్రలో గాని అరెస్టు లు జరిగాయా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. ఏరాష్ట్రంలో కూడా ప్రతిపక్ష నేతల అరెస్ట్ సంస్కృతి లేదు. జగన్ ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెర తీసింది. రాజధాని భూములు తిరిగిచేస్తారన్న అంశం ఆశ్చర్యనికి గురిచేస్తుంది ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకుని రివర్స్ గెర్లో నడుస్తున్న ప్రభుత్వంఇది. పోలవరం ఆపేసి విశాఖ కు నీరు తెస్తాననడం సాధ్యమా? ఆంధ్రప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అభివృద్ధిలో అందరిని భాగస్వామ్యం చేసుకుని వెళ్ళాలని సూచించారు. అందరిని రోడ్డున పడేసే ప్రయత్నాలు మంచివికాదు. ఒకరు స్మశానమని, మరోకారు ఎడారి అని, ఇంకొకరు ముంపు ప్రాంతమని అనడం ఎంతవరకు సబబని అడిగారు. ప్రజలంతా బయటకు రావాలి..ఇది ఒక రాజకీయ పార్టీకి సంబందించిన సమస్య కాదు రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన సమస్య. చంద్రబాబు ఆర్ధిక కుంభకోణాలతో జైలుకి వెళ్లిన వ్యక్తి కాదు. చంద్రబాబు సమర్ధమైన, అనుభవం ఉన్న నాయకుడు. శ్రీనగర్ లో ఉన్న పరిస్థితిని ఆంధ్ర ప్రదేశ్ లో తీసుకురావడం అన్యాయమని అయన అన్నారు.