YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్ట్ !

రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్ట్ !

రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్ట్ !
అమరావతి జనవరి 9  
ఆంధప్రదేశ్ రాజధాని పై రాష్ట్ర హై కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులేవీ జారీ చేయనప్పుడు..ఆ అంశంలో తాము ఎలా జ్యోకం చేసుకోగలమని ప్రశ్నించింది. ఈ తరుణంలో తరలింపును సవాలు చేస్తూ దాఖలయ్యే పిటిషన్స్ అన్ని కూడా పనికిరాని అపరిపక్వమైనవే అవుతాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. రాజధాని అంశం పై తక్షణమే హై కోర్ట్ జ్యోకం చేసుకోవాలని గుంటూరుకి చెందిన న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు పిటిషన్ దాఖలు చేసారు. అయితే హై కోర్ట్ మాత్రం అంత హడావుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పింది. తరలింపు అనేది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని అందువల్ల ఈ విషయంలో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని పేర్కొంది. అత్యవసరం అనుకుంటే సంక్రాంతి సెలవుల తరువాత పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావుకు స్పష్టం చేసింది. రాజధాని తరలింపునకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని అందువల్ల ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాలని న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు బుధవారం సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి న్యాయమూర్తి జస్టిస్ మంథాట సీతారామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ... రాజధాని తరలింపుపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఏవైనా అధికారిక ఉత్తర్వులు వచ్చాయా అని ప్రశ్నించింది. లేదని సుబ్బారావు చెప్పడంతో అలాంటప్పడు ఇంత అత్యవసరంగా ఈ అంశంపై విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

Related Posts