అధికార పార్టీల మోచేతి నీళ్లుతాగే పార్టీ ఎంఐఎం: బండి సంజయ్
కరీంనగర్ జనవరి 9
: ఎంఐఎం పార్టీపై తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీల మోచేతి నీళ్లుతాగే పార్టీ ఎంఐఎం అని, అసదుద్దీన్ ఓవైసీకి సిగ్గు లేదని, మూర్ఖుడని అన్నారు. ఎంఐఎం దేశ ద్రోహ పార్టీఅని, డైరెక్షన్ దారుస్సాలం.. యాక్షన్ ఫాంహౌస్, ఇంప్లిమెంటేషన్ ప్రగతి భవన్ అని విమర్శించారు. మంత్రులకు అపాయింట్‌మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్..ఓవైసీకి మాత్రం ఇస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ భవన్‌కు వెళ్తే కేసీఆర్ ఎందుకు సంతకం చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ పెట్టే సంతకం లాంటిదే ఎన్ఆర్సీ, సీఏఏ అని సంజయ్ అన్నారు.హైదరాబాద్‌లో జీహాదీలున్నారని, అందుకే ఇన్ని దాడులు జరుగుతున్నాయని బండి సంజయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసద్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న హిందువుల గురించి అసద్ మాట్లాడరని, జిహాదీలకు బీర్లు, బిర్యానీలు ఇచ్చి మేపాలా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకిలించాల్సిందేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.