YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రతిపక్షనేత చంద్రబాబును అడ్డుకోవడం పిరికిపంద చర్య 

ప్రతిపక్షనేత చంద్రబాబును అడ్డుకోవడం పిరికిపంద చర్య 

 ప్రతిపక్షనేత చంద్రబాబును అడ్డుకోవడం పిరికిపంద చర్య 
తెలుగుదేశం పార్టీ      
గోనెగండ్ల జనవరి 10 
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపక్ష నేత శ్రీ నారాచంద్రబాబునాయుడు గారిని,ఎమ్మెల్యేలను,మాజీ మంత్రులను,అమరావతి పరిరక్షణ సమితి నేతలను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వం యొక్క పిరికిపందా చర్యగా మండల తేదేపా నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీ ఆదేశాల మేరకు,మాజీ ఎమ్మెల్యే డా. బివి జయనాగేశ్వర రెడ్డి  ఆదేశాలకు అనుగుణంగా గోనెగండ్ల తేదేపా నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాజధాని ఏమి అని అడిగితే 5కోట్ల మంది ప్రజలు చెప్పలేని పరిస్థితి నెలకొంది అని విమర్శించారు.ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా కూల్చివేతలు,రద్దులు,ప్రైవేట్ కంపెనీలు వెనక్కి వెళ్లిపోవడం,ఇసుక కొరత,ఎన్టీఆర్ గృహాలు నిలిపివేత,అన్నా క్యాంటీన్లు మూసివేత,నిరుద్యోగ భృతి రద్దు,ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం రద్దు చేయడం తప్ప ప్రభుత్వం ఏమి చేయలేదని ఆరోపించారు.పాలన చేతకాక ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.రాజధాని విషయంలో 5 కోట్ల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.3 రాజధానుల పేరుతో 33 వేల ఎకరాలు ఇచ్చిన 22 వేల మంది రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు చెపితే వైసీపీ నేతలు విమర్శలే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ప్రభుత్వానికి నిజంగా రాజధాని అమరావతి రైతులపై ప్రేమ ఉంటే 29 గ్రామాల్లో ఎందుకు పర్యటించి రైతుల పక్షాన న్యాయం చేస్తామని చెప్పడం లేదన్నారు.ఈరోజు రాజధాని అమరావతి కి భూములు ఇచ్చిన రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నా చంద్రబాబు గారిని,ఇతర ప్రజా సంఘాల నేతలను,అమరావతి పరిరక్షణ సమితి నేతలను అడుగడునా అడ్డుకోవడం ప్రభుత్వం యొక్క అసమర్థత తెలియజేస్తుందన్నారు.రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతుల యొక్క బాధలను వివరించేందుకు 13 జిల్లాల్లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ తరుపున బస్సు యాత్ర చేపడితే ఆ బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారన్నారు.ప్రభుత్వం అరాచక పాలన అపి ప్రజల సంక్షేమ పాలనా అందించాలని కోరారు.చంద్రబాబు రాష్ట్రంలో విలువలు ఉన్న నాయకుడని మీలాగా దోచుకోవడం దాచుకోవడం తెలియదన్నారు.కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసి భూములు ఇచ్చినా రైతులకు కన్నీళ్లు పెట్టించడం ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు.ఈ కార్యక్రమంలో తేదేపా మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts