YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో టీఆర్ఎస్ దే హవా..రిపబ్లిక్ టీవీ

తెలంగాణలో టీఆర్ఎస్ దే హవా..రిపబ్లిక్ టీవీ

వచ్చే ఎన్నికల్లోనూ తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీనే విజయఢంకా మోగించనుందా?. అంటే అవునంటుంది ఓ టీవీ. సీఓటర్, రిపబ్లిక్ టీవీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం తెలంగాణలో ఎన్డీయే ఒక సీటును అదనంగా దక్కించుకోనుంది. అదే సమయంలో యూపీఏ తన  రెండు సీట్లను నిలబెట్టుకోనుంది. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీట్లు మాత్రం 13 నుంచి 12కు తగ్గుతాయని రిపబ్లిక్ టీవీ సర్వే చెబుతోంది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో కెసీఆర్ పరిస్థితి ఆశాజనంగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

ఓటింగ్ శాతం విషయానికి వస్తే 2018 జనవరి నాటికి ఎన్డీయే ఓట్ల శాతం 22.8 శాతం నుంచి 28.5 శాతానికి పెరగ్గా…యూపీఏ ఓటింగ్ శాతం25.5 శాతం నుంచి 25.2 శాతానికి తగ్గినట్లు రిపబ్లిక్ టీవీ అంచనా. అదే సమయంలో అధికార టీఆర్ఎస్ ఓటింగ్ శాతం గత ఎన్నికల్లో 51.8 శాతం ఉండగా..ఇప్పుడది 46.3 శాతానికి తగ్గినట్లు అంచనా వేశారు. రిపబ్లిక్ టీవీ సర్వే అధికార టీఆర్ఎస్ కు కొత్త ఊపునిచ్చేలా ఉంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ కు ఈ పరిణామం ఏ మాత్రం మింగుడుపడని వ్యవహారమే.

 

Related Posts