YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

వాహనం ఓకే.. మరి నెంబర్ ప్లేట్..?

వాహనం ఓకే.. మరి నెంబర్ ప్లేట్..?

వాహనం ఓకే.. మరి నెంబర్ ప్లేట్..? (కరీంనగర్)
కరీంనగర్, జనవరి 10: కొత్త వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న యజమానులు.. వాటికి నంబరు ప్లేట్లు బిగించడానికి ఇష్టపడటం లేదు. గతంలో అన్ని మోటారు వాహనాల తనిఖీ అధికారుల కార్యాలయాల వద్ద ఓ సంస్థ నూతన వాహనాలకు కేటాయించిన రిజిస్ట్రేషన్‌ నంబరు ప్లేట్లను బిగించేది. 2013లో హైసెక్యూరిటీ ప్లేట్లు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన చట్టానికి సవరణ చేసి, నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది ఈ ఏడాది అక్టోబరు 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విధానం ప్రకారం వాహనం కొనుగోలు చేసిన డీలర్ల వద్దే సంబంధిత వాహనదారుడు హైసెక్యూరిటీ నంబరు ప్లేటుని బిగించుకోవాలి. సరికొత్త విధానంపై తగిన అవగాహన లేక ఎక్కడ బిగించుకోవాలో తెలీక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు వస్తుంటాయి. కాలం చెల్లిన వాహనాలను విక్రయించేసి.. సరికొత్త  వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే వాహనాలను నడపడానికి కావాల్సిన కనీస పత్రాలను పొందడంలో నిర్లక్ష్యం వహిస్తూ జరిమానాల బారిన పడుతుంటారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వాహనాలను సీజ్‌ చేసి, భారీ మొత్తంలో రుసుము వసూలు చేస్తేనే గానీ సంబంధిత యజమానులకు నియమ నిబంధనలు గుర్తుకురాకపోవడం గమనార్హం. ఏ ప్రాంతంలో వాహనాన్ని కొనుగోలు చేసినా.. తప్పనిసరిగా ఏజెన్సీల వద్దకే నంబరు ప్లేట్ల కోసం వెళ్లే పరిస్థితి ఉండేది. దీంతో పలువురు వాహన యజమానులు తర్వాత చూద్దాంలే.. అనే ధోరణితో నంబరు ప్లేట్ల సంగతిని పక్కనపెట్టేవారు. ఈ క్రమంలో ఏజెన్సీల్లో నంబరు ప్లేట్లు కుప్పలుగా పేరుకుపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లింక్‌ ఆటోటెక్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థకు సంబంధించి కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా కేంద్రాలతో పాటు రామగుండం, హుజూరాబాద్‌, కోరుట్లలో ప్లేట్లు బిగించే కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో 30 నుంచి 40 వేల నంబరు ప్లేట్లు మిగిలిపోయినట్లు తెలిసింది. దీనికి పరిష్కార మార్గంగా నిబంధనలను సడలిస్తూ కొత్త వాహనాలకు నంబరు ప్లేట్లను డీలర్ల వద్దే పొందే అవకాశం కల్పించారు. అయినా వాహనదారులు ఆసక్తి చూపడం లేదు. అక్టోబరు 14 నుంచి ఈ నెల 11 వరకు 13,988 వాహనాలకు రిజిస్ట్రేషన్‌ కాగా అందులో 30 శాతం వాహనదారులూ నంబరు ప్లేట్లను బిగించుకోలేదని సమాచారం. వాహనానికి ముందూ.. వెనుక ఉండే హైసెక్యూరిటీ నంబరు ప్లేట్లు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. ప్రమాదాలు జరిగినపుడు, ఇతర సందర్భాలలో ప్లేటు చివరిలో ఉన్న లేజర్‌ కోడ్‌ను ట్రాక్‌ చేసి వాహనదారుడి పేరు, వాహనం వివరాలు తెలుసుకోవచ్చు. ప్రమాద సమయంలో వాహనం ధ్వంసమైనా లేజర్‌ కోడ్‌ ద్వారా వివరాలు తెలుసుకునే వీలుంటుంది. వాహనం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న తర్వాత నాలుగు రోజుల్లో డీలర్‌ వద్దకు నంబరు ప్లేటు చేరుతుంది. వారం రోజుల్లోపు వాహనానికి నంబరు ప్లేటు తప్పనిసరిగా బిగించుకోవాలి. నంబరు ప్లేటు లేకుండా తిరుగుతూ పోలీసులకు చిక్కితే.. వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు జరిమానా విధించే ప్రమాదముంది.

Related Posts