అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత
అమరావతి జనవరి 10,
ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆందోళనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.శుక్రవారం ఉదయం రాజధాని ప్రాంతం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మందడం, తుళ్లూరులో రైతులు, మహిళల నిరసనలతో హోరెత్తింది. విజయవాడ కనకదుర్గమ్మకు సారె, నైవేద్యం సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమైన రైతులు, మహిళలను పోలీసులు అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, రైతుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులను లాఠీలతో చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. లాఠీచార్జ్లో పలువురు మహిళా రైతులకు గాయాలయ్యాయి. పోలీసుల వలయాన్ని అడ్డుకుని ప్రజలు ముందుకు వెళ్లారు. రాజధానిలో పోలీసుల తీరుపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.