గుడికి వెళ్ళకుండా.. మీలాగా కోర్టుకు వెళ్లమంటారా?: చంద్రబాబు
అమరావతి జనవరి10
రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. గుడికి వెళ్తున్న అమరావతి మహిళలను అడ్డుకోవడాన్ని ట్విట్టర్ వేదికగా తప్పుబట్టిన ఆయన.. ఆ విషయాన్నే చెబుతూ ‘శుక్రవారం గుడికి వెళ్ళకపోతే మీలాగా కోర్టుకు వెళ్ళమంటారా?’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గుడికొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడం ఏంటని.. గ్రామ దేవతలని పూజించుకోడానికి పోలీసుల అనుమతి తీసుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతులు గుడికి వెళ్తుంటే దౌర్జన్యంగా అరెస్టు చేస్తారా? ఆంధ్రప్రదేశ్ లో మానవ హక్కులు ఉన్నాయా?’ అని ప్రశ్నించారు.