అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు
హైదరాబాద్ జనవరి 10
శాంతి భద్రతల కు విఘాతం కలిస్తే కేసులు పెట్టండని హైకోర్టు పోలీసులకు ఆదేశాన్ని ఇచ్చింది. సిఏఏ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం తలపెట్టిన ర్యాలీ ని అనుమతిచొద్దని హైకోర్టు లో దాఖలయిన పిటీషన్ ను శుక్రవారం కోర్టు విచారించింది. పాత బస్తీ బహదూర్ పుర వాసి నంద రాజ్ ఈ పిటిషన్ దాఖలు చేసారు. అయితే, ఎంఐఎం తలపెట్టిన సిఏఏ కు మిరాలం నుంచి శాంతి పురం వరకు మాత్రమే ర్యాలీ ఇచ్చామనిపోలీసులు కోర్ట్ కు తెలిపారు. పోలీసులు అనుమతి ఇచ్చిన పరిధి వరకే ర్యాలీ చేసుకోవాలన్న హైకోర్టు, నగరంలో ఎక్కడ కూడా వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డిజీపీని ఆదేశించింది. ఏమైనా అల్లర్లు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయాలని, ర్యాలీ మొత్తం కూడా వీడియో గ్రఫీ చేయాలని డిజీపీ ని హైకోర్టు అదేశించింది.