YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాశ్మీర్ అంక్షలపై సమీక్ష జరపాలి

కాశ్మీర్ అంక్షలపై సమీక్ష జరపాలి

కాశ్మీర్ అంక్షలపై సమీక్ష జరపాలి
కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ జనవరి 10
జమ్మూ కాశ్మీర్ లో ఇంటర్నెట్ ఆపివేయడం, 144 సెక్షన్ విధించడం వంటి నిర్ణయాలపై వారంలోగా సమీక్షించాలని  సుప్రీం  కోర్టు ఆదేశించింది. జమ్మూకశ్మీర్లో విధించిన ఆంక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది.  ఇంటర్నెట్ వాడుకునే వెసులుబాటు కూడా ప్రాథమిక హక్కేనని సుప్రీం ఈ సందర్భంగా పేర్కొంది.  జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో విధించిన ఆంక్షలను ఎత్తేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో శుక్రవారం విచారణ ముగిసింది.  కేంద్రం ఆంక్షలు చట్టవిరుద్ధమని, కశ్మీర్లో ఉన్నఅన్ని రకాల ఆంక్షలపై వారంలోపు సవిూక్ష చేయాలని ఆదేశించింది. ఆంక్షలకు సంబంధించిన ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని పేర్కొంది.  ఇంటర్నెట్ సేవలను శాశ్వతంగా నిలిపివేయడానికి అనుమతించం అని కోర్టు స్పష్టం చేసింది.  ఇంటర్నెట్ సేవలు నిలిపివేసే ఉత్తర్వులు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని కోర్టు ఆదేశించింది. కశ్మీర్ చాలా తీవ్రమైన హింసను చూసిందని, అయితే తాము శాంతి భద్రతల్ని పరిగణనలోకి తీసుకుని మానవ హక్కులను, ఫ్రీడం ఆఫ్ స్పీచ్ను బ్యాలెన్స్ చేయాల్సి ఉందని సుప్రీం కోర్టు చెప్పింది. జమ్ము కశ్మీర్ లో 144 సెక్షన్, ఇంటర్నెట్ నిలిపివేత సహా ట్రావెల్ రిస్టిక్ష న్స్ వంటి ఆంక్షలు ఏమేం ఉన్నాయో అక్కడి ప్రభుత్వం ప్రచురించాలని, దీనిపై న్యాయపరంగా చాలెంజ్ చేసే అవకాశం కల్పించాలని సూచించింది. ప్రభుత్వ వెబ్ సైట్లు, ఈ- బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఇంటర్నెట్ ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయలేమని కోర్టు వ్యాఖ్యానించింది. 

Related Posts