YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఎస్సై, సీఐ సస్పెన్షన్

ఎస్సై, సీఐ సస్పెన్షన్

ఎస్సై, సీఐ సస్పెన్షన్
హైద్రాబాద్, జనవరి 10
పోలీస్ స్టేషన్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటనలో ఎస్సై సుధీర్ రెడ్డి, సీఐ బలవంతయ్యపై వేటు పడింది. శుక్రవారం పీఎస్‌లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై సుధీర్ రెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డి సహా సీఐ బలవంతయ్యపై కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు విభాగంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరుందని, దీన్ని నాశనం చేయాలని చూస్తే సహించబోమని సీపీ తేల్చి చెప్పారు. ఎవరైనా పోలీసులు అవినీతికి పాల్పడితే 9490616555 నంబరుకు ఫోన్ చేసి ప్రజలు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. అలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకుంటామని అన్నారు.అయితే, రూ.50 వేలు లంచంతో జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్యకు సంబంధమున్నట్లు ఆరోపణలున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నుంచి సీఐ అందుబాటులో లేరని తెలుస్తోంది. ఎస్సై సుధీర్ రెడ్డిని దాదాపు 3 గంటలు విచారణ జరిపాక, అతని కాల్ రికార్డులను కూడా పరిశీలించారు. ఇందులో సీఐ, ఎస్సై మధ్య ఫోన్ సంభాషణలను పరిశీలించారు.శుక్రవారం హైదరాబాద్‌లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ ఎస్సైతోపాటు, నాంపల్లి గృహకల్ప భవనంలో డీసీపీవో స్టేట్ జీఎస్టీ అధికారి కొమ్ము బుచ్చయ్య, శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ విభాగం అధికారి యాదయ్య ఏసీబీకి చిక్కారు.

Related Posts