లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
ముంబయి జనవరి 10
అమెరికా-ఇరాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో వరుసగా రెండో రోజు సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 77 పాయింట్లకుపైగా లాభపడి 41530 వద్ద.. నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 12237 వద్ద కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్ లాభాల్లో కొనసాగుతుండగా.. ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్టాలను నమోదు చేస్తున్నాయి. దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నేడు ఫలితాలు ప్రకటించనుంది. మిస్త్రీని ఛైర్మన్‌గా పునర్నియమించాలంటూ ఎన్‌సీఎల్‌ఏటీ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టాటాసన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. ఈ రెండు పరిణామాలపై మదుపర్లు దృష్టి సారించవచ్చు.