విపక్ష పోరాటాలకు దీటైన సమాధానం
శ్రీకాకుళం జనవరి 10
విశాఖ కేంధ్రంగా పరిపాలన రాజధానిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర మేధావుల ఫారం స్వాగతించింది. ప్రభుత్వ నిర్ణయంపై శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన చర్చాగోష్టి కార్యక్రమంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గోన్నారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే పోరాటాలకు ధీటైన సమాధానం చెబుతామని అన్నారు.ఇన్‌సైడ్ ట్రేడింగ్‌ను, ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు జనాల్ని రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో సాగేది సహజ సిద్ధమైన పోరాటం కాదని, అసలుసిసలైన ప్రజా ఉద్యమం అంటే ఏంటో తాము చూపిస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి రాజయలసీమ వరకూ సాగే ఉద్యమం ఎలా ఉంటుందో బాబు చూస్తారని,ఉత్తరాంధ్ర నుంచి వెళ్లిన టీడీపీ నేతలు పార్టీ స్టాండ్ తో అమరావతి కావాలనడం సిగ్గుచేటని అన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని అన్నారు.అయితే గతంలో ఏ కారణం లేకుండా జగన్‌ను విశాఖ ఎయిర్ పోర్టులో ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.