YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మిలియన్‌ మార్చ్‌ ను తలదన్నే రీతిలో సాగిన ముస్లింల నిరసన ర్యాలీ

మిలియన్‌ మార్చ్‌ ను తలదన్నే రీతిలో సాగిన ముస్లింల నిరసన ర్యాలీ

మిలియన్‌ మార్చ్‌ ను తలదన్నే రీతిలో సాగిన ముస్లింల నిరసన ర్యాలీ
హైదరాబాద్ జనవరి 10 (న్యూస్ పల్స్)

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ముస్లిం యునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మీరాలం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈ ర్యాలీ ప్రారంభమైంది.పాతబస్తీ మీరాలం ఈద్గా నుంచి రాజేంద్రనగర్‌ వరకు ముస్లింలు ర్యాలీ చేశారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు. వేలాది మంది ముస్లింలు జాతీయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముస్లిం సంఘాలు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నాయి. ర్యాలీలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ర్యాలీ దృష్ట్యా పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏకి వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగారు. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే కేసులు పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. సీఏఏను వ్యతిరేకిస్తూ ఎంఐఎం తలపెట్టిన ర్యాలీకి అనుమతించొద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. మిరాలం నుంచి శాంతిపురం వరకే ర్యాలీకి అనుమతిచ్చామని కోర్టుకు పోలీసులు తెలిపారు. పోలీసులు అనుమతి ఇచ్చిన పరిధి వరకే ర్యాలీ చేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డిని ధర్మాసనం అదేశించింది. అల్లర్లు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేయాలని, ర్యాలీ మొత్తం కూడా వీడియో తీయాలని డీజీపీకి హైకోర్టు ఆదేశించింది.ఇటీవల ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్‌పై ముస్లింలు మిలియన్‌ మార్చ్‌ ను తలదన్నే రీతిలో ర్యాలి సాగింది.ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చారు. భారీ ర్యాలీతో ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయ్యింది. ధర్నాచౌక్‌ దగ్గర ర్యాలీలో కాంగ్రెస్ నేత వీహెచ్‌, అజీజ్‌ పాషా పాల్గొన్నారు. మిలియన్‌ మార్చ్‌కు షరతులతో సీపీ అనుమతి ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.హసన్‌నగర్‌, ఆరాంఘర్‌, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా శాస్త్రిపురం వరకు ఇది కొనసాగనుంది.ముస్లిం యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ జెండాలతో ఈ ర్యాలీకి తరలి వచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలో సుమారు 30వేల మంది పాల్గొన్నట్లు అంచనా. భారీ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ర్యాలీ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

Related Posts