13 , 14, 15 తేదీల్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
హైదరాబాద్ జనవరి 11
ఇంటర్నేషనల్ కైట్ అండ్ 3వ స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లు ను రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం ఇతర ప్రభుత్వ అధికారులతో కలసి పర్యవేక్షించారు.ఈ నెల 13 , 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న 5 వ అంతర్జాతీయ కైట్, స్వీట్ మరియు స్నాక్స్ పెస్టివల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర స్థాయి సంప్రదాయక ఆటలను నిర్వహిస్తున్నారు.25 దేశాలకు చెందిన వారు ఈ కైట్ ఫెస్టివల్లో పాల్గొననున్నారు.అలాగేదేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున కైట్ ప్లేయర్ లు, సందర్శకులు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారన్నారు.ఈ ఫెస్టివల్ లో కైట్ ల, స్వీట్ ల తో పాటు స్నాక్స్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుండి జింఖానా మైదానం లో పురాతన సాంప్రదాయ బద్ధమైన క్రీడలు...రాబోయే కాలంలో మూడు రోజుల ముందు నుండి వారం రోజుల పాటు ఈ ఫెస్టివల్స్ జరుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ తెలిపింది.అన్ని రకాల సాంప్రదాయబద్ధమైన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు , షాపింగ్, తెలంగాణ వంటకాలు అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచుతామన్నారు.ఈ ఫెస్టివల్ విజయవంతంగా నిర్వహించడం కోసం అన్ని ఏర్పాటు చేస్తున్నారు.ఈసారి 12 నుండి 15 లక్షల మంది వస్తారని అంచనా...సందర్శకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ పాల్గొనే కార్యక్రమాలు ఉంటాయి ...స్వీట్స్, స్నాక్స్ , ఫుడ్ లతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిరంతరం గా జరుగుతాయన్నారు.ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సందర్శించవచ్చు అని తెలిపారు.