YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసులు 144 సెక్షన్ పెట్టి అమరావతి మహిళలు, రైతులను టార్చర్ పెడుతున్నారు  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

పోలీసులు 144 సెక్షన్ పెట్టి అమరావతి మహిళలు, రైతులను టార్చర్ పెడుతున్నారు  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్

 పోలీసులు 144 సెక్షన్ పెట్టి అమరావతి మహిళలు, రైతులను టార్చర్ పెడుతున్నారు  టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్
అమరావతి : పోలీసులు 144 సెక్షన్ పెట్టి అమరావతి మహిళలు, రైతులను టార్చర్ పెడుతున్నారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. అదివారం గుంటూరులో పర్యటిస్తున్న జాతీయ మహిళా నిజనిర్దారణ కమిషన్‌ బృందాన్ని కలిసి.. రాజధాని ప్రాంతలో మహిళా రైతులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై కమిషన్ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై మహిళా కమిషన్ సానుకూలంగా స్పందించిందన్నారు. టెర్రరిస్టులు, నక్సల్స్‌పై వాడాల్సిన సెక్షన్లను.. రాజధాని రైతులపై పోలీసులు వాడుతున్నారని మండిపడ్డారు. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో పోలీసులు మహిళల ఇంటి తలుపులు కొట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. మహిళలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర మహిళ కమిషన్ స్పందించటం లేదన్నారు. జాతీయ మహిళ కమిషన్ వచ్చిందని, ఇప్పటికైనా మహిళలపై దాడులు ఆపాలని పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. టీడీపీ నేత గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళలపై పోలీసులే దాడులు చేస్తుంటే.. ఇక ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. అందుకే మహిళ కమిషన్‌ను ఆశ్రయించామని చెప్పారు. ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని గద్దె అనురాధ విమర్శించారు.
 

Related Posts