YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలవరం వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు

పోలవరం వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు

‘పోలవరం’పై చంద్రబాబు తప్పు ఒప్పుకున్నట్లేనా!

‘గిట్టుబాటు కాకపోతే కాంట్రాక్టర్ ను  కట్టేసి కొట్టినా పనిచేయలేరు’. ఇదీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ట్రాన్స్ స్ట్రాయ్ ను ఉద్దేశించి  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం చెప్పిన మాట. కానీ ఈ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇదంతా చూస్తుంటే చంద్రబాబు ప్లాన్ కు  మోడీ సర్కార్ విజయవంతంగా బ్రేక్ లు వేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రజలకు ఎన్నో సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తప్పులను పరోక్షంగా అంగీకరించినట్లే అవుతుంది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ సంస్థా? లేక స్వచ్చంద సంస్థా?., ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కాంట్రాక్ట్ సంస్థ అయినా నష్టం వచ్చినా సరే.. మేం పని చేస్తాం అని ముందుకొస్తుందా?.,ఏపీ లాంటి రాష్ట్రంలో ప్రతి పనికీ అడ్డగోలుగా అంచనాలు పెంచేసి..కాంట్రాక్టర్ల దోపిడీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటే…అబ్బే మాకు లాభం అక్కర్లేదు..చంద్రబాబు లక్ష్యమే ముఖ్యం అని ఓ ప్రైవేట్ సంస్థ ఎందుకు ముందుకు వస్తుంది?.

నవయుగ పాత రేట్లకు చేయగలిగినప్పుడు చంద్రబాబు ఇంత కాలం మద్దతు ఇచ్చి అండగా నిలిచిన అధికారిక కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ స్ట్రాయ్ ఇదే పని ఎందుకు చేయలేకపోయింది. ఇన్ని వివాదాలకు కారణం ఎందుకు అయినట్లు?.అంటే ఓ రాష్ట్రం కాంట్రాక్ట్ సంస్థ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలా?. ఇది ప్రభుత్వానికి సిగ్గుచేటు అయిన అంశం కాదా?.పోలవరంలో ఏదో ఉదారంగా పని చేసినందుకు గాను నవయుగాకు ఏపీలో ఉన్న ఓడరేవు ప్రాజెక్టులు..కాంట్రాక్ట్ సంస్థల్లో చంద్రబాబు సర్కారు పరోక్ష ప్రయోజనం కల్పించనుందా?. వీళ్లిద్దరి మధ్య కుదరిన రహస్య ఒప్పందం ఏంటి?.చంద్రబాబు సర్కారు పిలిచిన కొత్త టెండర్లలో అక్రమాలు ఉన్నందునే పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) వీటిని ఆమోదించలేదా?.వారం రోజుల్లోనే కొత్త టెండర్లలో అంచనాలు 80 కోట్ల రూపాయలు పెరిగిన వైనంపై కూడా కేంద్రం గుర్రుగా ఉందా?.,ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తానన్న కేంద్ర మంత్రి గడ్కరీ ఇఫ్పటి వరకూ ఇటువైపు చూడకపోవటానికి కారణం ఏమిటి?.,కేంద్రమే చర్చల ద్వారా పాత రేట్లకు పనిచేసే కాంట్రాక్టర్ ఎంపిక చేయమని ఆదేశించిందా?.,.వైఎస్ హయాంలో నవయుగా సంస్థపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు అదే సంస్థతో అంటకాగటం వెనక ఉన్న మతలబు ఏమిటి?

 

Related Posts