YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

ఎమర్జెన్సీ లిస్ట్ లో 100 మెడిసిన్స్

ఎమర్జెన్సీ లిస్ట్ లో 100 మెడిసిన్స్

ఎమర్జెన్సీ లిస్ట్ లో 100 మెడిసిన్స్
నల్గొండ, జనవరి 13, 
ఎమర్జెన్సీ సమయంలో ప్రాణాలు నిలిపే ఖరీదైన మెడిసిన్స్ను సర్కార్ దవాఖాన్లలో మరిన్ని అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎమర్జెన్సీ డ్రగ్స్‌‌ లిస్ట్‌‌లో సుమారు వంద కొత్త మందులను చేర్చింది. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌ డాక్టర్ రమేశ్‌‌రెడ్డి నేతృత్వంలో మందుల కొనుగోలుపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు ఎమర్జెన్సీ డ్రగ్స్‌‌ లిస్ట్‌‌ను అప్‌‌డేట్ చేశారు. ఏప్రిల్ నుంచి మందులు అందుబాటులోకి వస్తాయని తెలంగాణ స్టేట్‌‌ మెడికల్ సర్వీసెస్‌‌, ఇన్‌‌ఫ్రాస్ర్టక్చర్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌‌ (టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి తెలిపారు. ఒక్కో డ్రగ్‌‌ ఖరీదు రూ.వేలల్లో ఉంటుందని, అత్యవసర సమయంలో గవర్నమెంట్ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లకు ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు.ప్రస్తుతం 213 రకాల ఎమర్జెన్సీ మెడిసిన్స్ను సర్కారు దవాఖాన్లకు టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ పంపిణీ చేస్తోంది. వీటికి అదనంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించే మరిన్ని రకాల యాంటిబయాటిక్స్, యాంటిపైరేటిక్స్‌‌, కార్డియోవాస్కులర్‌‌‌‌ మెడిసిన్, సైకోథెరపిక్ మెడిసిన్‌‌, పాయిజన్ కేసుల్లో వినియోగించే యాంటిడోట్స్‌‌ సహా మొత్తం 31 రకాల వ్యాధుల్లో ఉపయోగించే100 రకాల ఎమర్జెన్సీ డ్రగ్స్‌‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే చాలా అరుదుగా ఉపయోగించే మెడిసిన్ కొనుగోలును తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.లక్షల ఖర్చు చేసి కొని, వాడక వృథా అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎమర్జెన్సీ డ్రగ్స్‌‌ ధర ఎక్కువగా ఉంటుండటంతో పేద రోగులపై భారం పడుతోంది. దీంతో కొత్త డ్రగ్స్‌‌ను అందుబాటులోకి తేవాలని పేషెంట్లతోపాటు, డాక్టర్ల నుంచి కూడా విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే  సర్కారు దవాఖాన్లలో అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ డ్రగ్స్‌‌, కొత్తగా చేర్చాల్సిన వాటిపై డీఎంఈ నేతృత్వంలో కమిటీ వేశారు. కొత్తగా 100 రకాల ఎమర్జెన్సీ డ్రగ్స్‌‌ కొనుగోలు చేయాలని ఈ కమిటీ సూచించింది.

Related Posts