YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీపీఐ రామకృష్ణ క్షమాపణ చెప్పాలి

సీపీఐ రామకృష్ణ క్షమాపణ చెప్పాలి

సీపీఐ రామకృష్ణ క్షమాపణ చెప్పాలి
విజయవాడ జనవరి 13 
భారత హోం మంత్రి అమిత్ షా పట్ల సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన దిగజారుడుతాననికి నిదర్శనమని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. రామకృష్ణ వ్యాఖ్యలు బీజేపీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారి కమ్యూనిస్టు పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అయన అన్నారు. భారత హోం మంత్రిని వాడు వీడు వీధి రౌడీ గుండా క్రిమినల్ పదాలతో మీరు మీ పార్టీ స్థాయి మీ స్థాయి పెరుగుతుంది అనుకుంటున్నారా? రాజకీయ పార్టీల విమర్శలను బీజేపీ ఎప్పుడైనా స్వాగతిస్తుంది వ్యక్తిగత విమర్శలను క్షమించే ప్రసక్తే లేదన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాం మేము కూడా మీలాగా మరింత కిందికి దిగి కూడా మీ పట్ల మీ పార్టీ పట్ల మాట్లాడవచ్చు మాకు కూడా తెలుసు.మా పార్టీ మాకు సంస్కారం నేర్పిందా మీ పార్టీ మీకు ఈ విషయం అర్థమవుతుందా అని అన్నారు. బూతులు మాట్లాడటం వ్యక్తిగత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం మీడియాలో ప్రదర్శనల కోసం సంచలన వార్తల కోసం మీరు చేసే వ్యాఖ్యలు పనికొస్తాయి. మీరే చేసే వ్యాఖ్యల పట్ల ప్రజలు మిమ్మల్ని అసహ్యించు కుంటారన్న విషయాన్ని మీ పార్టీ ,మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీ నేతలు గతంలో కూడా ఇలాగే దిగజారుడు వ్యాఖ్యలు చేయడం నాలుక కర్చుకోవడం క్షమాపణలు చెప్పడం పొరపాటుగా తయారైంది. మీ భాషను చూసి మీ పార్టీ కార్యకర్తలు కూడా అసహ్యించుకుంటున్నారనే విషయాన్ని గుర్తించుకోండని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈ దేశం ఇచ్చినటువంటి పదవులకు రాజ్యాంగ స్ఫూర్తికి కమ్యూనిస్టు పార్టీలకు గౌరవం ఉంటే తక్షణం ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బీజేపీకి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. నేడు దేశంలో రాష్ట్రంలో లో భారత కమ్యూనిస్టు పార్టీలు వామపక్ష భావజాలం చివరకు దేశద్రోహులకు సహాయపడే వారిని ఈ దేశ ప్రజలు తిరస్కరించారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలతో కలిసి మీకు సరైన సమయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ బుద్ధి చెబుతుందని అన్నారు. 

Related Posts