ఫిలిప్పీన్స్ లో బ్లాస్ట్ ఐన తాల్ అగ్నిపర్వతం
న్యూ డిల్లీ, జనవరి 13
ఫిలిప్పీన్స్ దేశంలోని తాల్ అగ్నిపర్వతం సోమవారం బ్లాస్ట్ కావడం తో లావా వెదజల్లింది. తాల్ అగ్నిపర్వతం పేలుడు కారణంగా లావా ప్రవహించడంతో అక్కడి నుండి 8వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. అగ్నిపర్వతం పేలుడుతో వెదజల్లిన లావా, పొగ వల్ల ఫిలిప్ఫీన్స్ దేశంలో ఇక్కడి ప్రజలు టీవీర ఇబ్బందులకు గురవుతున్నారు.అగ్నిపరత్వం పేలుడు వల్ల వ్యవసాయ భూములు, భవనాలు దెబ్బతిన్నాయి. మనీలా నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లావా వల్ల దుమ్ముధూళి వ్యాపించడంతో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు .దీనితో సోమవారం 286 విమానాల రాకపోకలను రద్దు చేశారు.