విద్యార్ధులు దైర్యంతో వుండాలి
ఒంగోలు, జనవరి 13,
విద్యార్ధులు విజ్ఙానంతో పాటు మంచి ప్రవర్తన, ధైర్యాన్ని కల్గివుండాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ 32వ వార్షిక దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో గౌరవ ప్రదమైన జీవితం గడపడానికి విజ్ఙానం, మంచి ప్రవర్తన, ధైర్యం వంటివి అవసరమని ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయిన జీవితంలో ముందుకు వుళ్లడానికి అవకాశాలు వుండవని, విజయాలు పాధించలేమని అన్నారు. విద్యార్ధులు ఉన్నత మైన లక్ష్యం వైపు కేంద్రీకృతం చేసి ఆత్మస్ధైర్యంతో ముందుకు సాగాలని కలెక్టర్ తెలిపారు. కష్టపడి చదవాలని, పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తన సొంతం అవుతుందని కలెక్టర్ విద్యార్ధులకు ఉద్బోధ చేశారు. స్వామి వివేకానంద భారతీయ తత్వవేత్త, గొప్ప మేధావి అని తన సందేశాలతో బలమే జీవితం, బలహీనతే మరణం అని తెలిపారని, నిద్రాణమైన యువతను స్వామి వివేకానంద తన ప్రసంగాలతో మేల్కొలిపారని ఆయన తెలిపారు. విద్యార్ధులు క్రొత్త అంశాలను తెలుసుకోవాలని అలాగే నైపుణ్యాలను అలవరచుకోవడానికి కృషి చేసి తాను ఎంచుకున్న రంగంలో రాణించాలన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో విద్యనభ్యసించే విధానం విభిన్నంగా వుంటుందని కలెక్టర్ తెలిపారు. దేశంలో వివిధ రాష్ట్రాలనుండి, జిల్లాల నుండి అడ్మిషన్స్ పొందిన విద్యార్ధులతో కలిసి విద్యనభ్యసింస్తారని, అదే విధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకునే అవకాశం వుంటుందన్నారు. విద్యార్ధులకు విద్యతో పాటు ఆటపాటలు ఎంతో అవసరమని అన్నారు. విద్యార్ధులు తమ పాత్రను తెలుసుకొని సృజనశీల విద్య పొంది ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పరీక్షల సమయంలో వివిధ సబ్జెక్ట్ లలో సిలబస్ పూర్తిగా చదవలేనప్పటికి అదృష్టం కలసివస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందవచ్చని తెలుపుతూ అన్ని సమయాలలో అదృష్టం కలసిరాదని గుర్తించి కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సంపాధించాలని కలెక్టర్ విద్యార్ధులకు సూచించారు. జవహర్ నవోదయ విద్యాలయాలలో స్పోర్ట్స్, అకడమిక్ లో వివిధ కార్యకలాపాలలో ఛాంపియన్ లుగా ప్రకటించిన విద్యార్ధులకు జిల్లా కలెకట్ర్ చేతులమీదుగా ఛాంపాయన్ ట్రోపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నాగార్జున పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ లోని చరిత్ర విభాగపు ప్రొఫెసర్ డాక్టర్ డి.వెంకటేశ్వర రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, విద్యార్ధిని, విద్యార్ధులు తో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.