YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబుది అవగాహనరాహిత్యం

చంద్రబాబుది అవగాహనరాహిత్యం

చంద్రబాబుది అవగాహనరాహిత్యం
విశాఖపట్నం జనవరి 13
అధికారం పోతే వారం కూడా ఉండలేని పరిస్దితి చంద్రబాబుది. కాంగ్రెస్ లో ఉంటూ ఎన్టీఆర్ పై పోటీచేస్తానన్న చంద్రబాబు వారం రోజుల వ్యవధిలోనే ఎన్టీఆర్ ను బతిమాలి టిడిపిలో చేరారు. ఉత్తరాంధ్రను అభివృధ్ది చేయడానికి  వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారని వైకాపా పార్టీ సీనియర్ నేత  దాడి వీరభధ్రరావు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. పలువురు నేతలు ఉత్తరాంధ్ర వ్యతిరేకంగావ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసులు టిడిపికి ఓటువేయలేదా అని ప్రశ్నించారు. కమిటీలో ఎవరు ఉన్నారో తెలియకుండా చంద్రబాబు ఇష్టంవచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు.  అమరావతి ప్రాంతం భవనాల నిర్మాణాలకు పనికిరాదని ఐఐటి నిపుణుల కమిటి తేల్చిచెప్పింది. చంద్రబాబు అవగాహనరాహిత్యం అనేకసార్లు బయటపడింది. ఒక ప్రాంతం అభివృధ్దికే చంద్రబాబు పోరాడుతున్నారు. ఉత్తరాంధ్ర అభివృధ్దిని చంద్రబాబు ఏనాడైనా పట్టించుకున్నారా. రాష్ర్టంలో అత్యంత వెనకబడ్డ ప్రాంతం ఉత్తరాంద్ర అని అయన అన్నారు. అభివృధ్ది వికేంద్రీకరణ చేపట్టాలని శివరామకృష్ణ కమిటి చెప్పింది. లక్షకోట్లతో అమరావతి సాధ్యమవుతుందా. ప్రపంచంలో తనకంటే తెలివైనవారు లేరని చంద్రబాబు భావన. ఎన్టీఆర్ చేపట్టిన ప్రాజెక్ట్ ను చంద్రబాబు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తాము అభివృధ్ది చెందుతామన్న భావన ఉత్తరాంధ్రలో కలుగుతుంది. విశాఖ అంటే చంద్రబాబుకు ఎందుకంత కోపమని అడిగారు. విశాఖనగరంలోని కేజిహెచ్ ను అభివృధ్దిచేయమని చంద్రబాబుకు చెబితే ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయి కదా అన్నారు. విశాఖరైల్వే జోన్ ,డివిజన్ లకు వ్యతిరేకంగా వ్యవహరించారు. విశాఖకు అనేక ఐటి కంపెనీలు వస్తే వాటిని అమరావతికి తరలించేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ ఈవెంట్లు,భూకుంభకోణాలకు వేదికగా విశాఖను వాడుకున్నారు. చంద్రబాబు దృష్టిలో విశాఖ ఒక విహారకేంద్రం మాత్రమే. చంద్రబాబు విశాఖనుండి ఇతర ప్రాంతాలకు తరలించిన సంస్ధలు తిరిగి వచ్చేలా చూడమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. భూకుంభకోణాలు బయటపడకుండా రికార్డులు మార్చారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు చంద్రబాబుకు పట్టవా అని అయన అడిగారు. 

Related Posts