YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మైనింగ్ మాఫియా ఆరెస్టులు

మైనింగ్ మాఫియా ఆరెస్టులు

మైనింగ్ మాఫియా ఆరెస్టులు
ఒంగోలు జనవరి 13,
ప్రకాశం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా అధికారులను మేనేజ్‌ చేస్తూ కోట్ల రూపాయలు గడించిన మైనింగ్‌ మాఫియాకు సంబంధించి కీలకంగా వ్యవహంచిన 16 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ వెల్లడించారు. 16 మంది నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచి వీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని మోసం చేశారో వివరించారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థీకృత నేరంగా మారిన కేసు ఇది. అద్దంకి స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ వీపీ శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా నకిలీ ఫరంలతో 290 కోట్ల 49 లక్షల 75 వేల 81 రూపాయల వ్యాపారం చేసి 52 కోట్ల 20 లక్షల 19 వేల 33 రూపాయల పన్ను ఎగ్గొట్టారని, తాము విచారించగా ధరఖాస్తులన్నీ తప్పుడు చిరునామాలతో ఆన్‌లైన్‌ లో సృష్టించినట్లుగా తమ ఫిర్యాదులో వచ్చినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి రెండు నెలల క్రితం తాము నలుగురిని అరెస్టు చేశామని,  ప్రస్తుతం 16 మందిని అరెస్టు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ట్యాక్స్‌ లు కట్టకుండా జీఎస్‌టీ, మైనింగ్‌ బిల్లులకు సంబంధించి 300 కోట్ల నష్టం వాటిల్లిందని, బిల్లులు లేకుండా తరలి వెళ్లిన సరుకు విలువ 900 కోట్లకుపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇంకా 123 మంది నిందితులను అరెస్టు చేయాల్సి ఉందని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

Related Posts