ఆక్వా పేరుతో వరి పంటకు కోత
ఏలూరు, జనవరి 14,
పర్యవరణంతో పాటు పరిశ్రమలనూ దెబ్బతీస్తున్నాయి చేపల చెరువులు. ఆక్వా అభివృద్ధి పేరుతో వ్యవసాయ భూములను నాశనం చేస్తుండడంతో ధాన్యం పండించేవారు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు మూడుపువ్వులు, ఆరుకాయలుగా విరిసిన రైస్ మిల్లులు నేడు సంక్షోభాన్నిఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ నిబంధనలు, సి.ఎమ్.ఆర్ విధానాలు నష్టాలబాటలోకి నెట్టేస్తున్నాయి. రాష్ట్రానికే ధాన్యగారంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో రైస్ మిల్లులు ఒకప్పుడు వందలాసంఖ్యలో ఉండేవి. దీనిపైనే ఆధారపడి వేలదిమంది కార్మికులు జీవనం సాగించేవారు. అయితే మారిన పరిస్ధితిలతో వ్యవసాయ భూముల స్ధానంలో చెపల చేరువులు విస్ధరించటంతో వరి పంట గణనీయంగా తగ్గింది. దాంతో దిగుబడి కూడా తగ్గడంతో వందలసంఖ్యలో ఉన్న రైస్ మిల్లులు కాస్తా తగ్గిపోయాయి. అయినా రైస్ మిల్లర్లు ఈ పరిశ్రమపై ఉన్న మక్కువతో కొనసాగిస్తున్నారు. ఒక పక్క సంక్షోభంలో నడుస్తుంటే మరోపక్క ప్రభుత్వం తీసుకోనే నిర్ణయాలు వీరికి శాపంలా మారాయి. అయితే ప్రభుత్వం రైస్ మిల్లర్స్ వ్యవస్థకు లేనిపోనీ కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో 100 శాతానికి 20శాతం బియ్యాన్ని ఇతర రాష్ట్రాలోను, ఇతర దేశాలకు అమ్ముకోవడంతో రైస్ మిల్లర్లకు లాభసాటిగా ఉంది. ఈ మధ్య ప్రభుత్వం సియమ్మార్ విధానాన్ని అమలులోకి తెచ్చి 1984 లెవీ కంట్రోల్ పెట్టడంతో ఇప్పుడు నేరుగా రైతుల వద్దే ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో మిల్లర్లు ప్రభుత్వం సరఫరా చేసే ధాన్యాన్ని ఆడవలసి వస్తుంది. ఈ పరిస్దితితో జిల్లాలో 6లక్షల టన్నులు నేరుగా ప్రభుత్వ అధికారులు కొనుగోలు చేసి మిల్లర్ల ద్వారా మిల్లింగ్ చేయిస్తున్నారు. దీంతో చాలా వరకూ రైస్ మిల్లులు మూతపడ్డాయని చెబుతున్నారు. మిల్లింగ్ నెమ్మదించడంతో కార్మికులకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సియమ్మార్ కస్టమ్ మిల్లింగ్ కు కేవలం క్వింటాల్ కు 12రూపాయల 50పైసలు మాత్రమే చెల్లిస్తుంటే పొరుగు రాష్ట్రమైన చత్తీస్ ఘడ్ లో క్వింటాల్ కు 40 రూపాయలు, తెలంగాణాలో 30 రూపాయలు చెల్లిస్తున్నారు. అక్కడ ఇచ్చేటట్లుగానే... ఆంధ్రాలో కూడా ఇస్తే తప్పా మిల్లర్లకు సమస్య తీరవంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లుకు హెచ్.టి విధ్యుత్ వాడకం ను అనివార్యం చేసింది. గతంలో రైస్ మిల్లు పరిశ్రమను ఆదుకునేందుకు 160 హార్స్ పవర్ సరఫరా చేశేవారు. అ తరువాత 100 హెచ్.పి, రెండేళ్ల నాడు 75 హెచ్.పికి తగ్గించారు. గతంలో 150 హెచ్.పి వరకు ఎల్.టి గానే పరిగణించేవారు. ఇప్పుడు 75 హెచ్.పి కూడా హైటెక్షన్ కనెక్షన్ గా పరిగణించాలని అధికారులు ఆదేశించటంతో రైస్ మిల్లర్లు లబోదిబోమంటున్నారు. అయితే రైస్ మిల్లింగ్ లో వచ్చిన మార్పుల వల్ల నష్టాల ఊభిలో రోజు రోజుకు కూరుకు పోతున్నామని కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్దితిలో ఉండటంతో 60శాతం వరకూ మిల్లులు మూత పడ్డాయని రైస్ మిల్లర్లు వాపోతున్నారు. మిల్లులు మూతపడిన కాలనికి సైతం లక్ష రూపాయల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన పరిస్ధితి నెలకొంది.ఆంధ్ర రాష్ట్రానికే అన్నపూర్ణగా ఉన్న జిల్లాలో రోజు రోజుకూ వ్యవసాయ రంగంలో వస్తున్న ఇబ్బందులతో రైస్ మిల్లర్లు కష్టాల ప్రయాణం తప్పడం లేదని ప్రభుత్వం ఇప్పటికైనా రైస్ మిల్లింగ్ పరిశ్రమపై సవతి తల్లి ప్రేమ కనబర్చకుండా అదుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు.