YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ సీఎం గా వున్నంతకాలం ఏపీకి కష్టకాలం

జగన్ సీఎం గా వున్నంతకాలం ఏపీకి కష్టకాలం

జగన్ సీఎం గా వున్నంతకాలం ఏపీకి కష్టకాలం
అమరావతి జనవరి 14 
తుళ్ళూరు మండలంలో 144 సెక్షన్,30 పోలీస్ యాక్ట్ మహిళలు,రైతులపై ఎందుకు పెట్టారో చెప్పాలి.  144 సెక్షన్ అమలుపై హైకోర్టు ఆగ్రహించింది. శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే 144 సెక్షన్ ఎలా పెడతారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. పోలీసు డిపార్గ్ మెంట్ పై హైకోర్టు మండిపాటు, రైతులకు సంతోషాన్నిచ్చే విషయమని అన్నారు. టెర్రరిస్టులు, నక్సల్ పై వాడే చట్టాన్ని రైతులు,మహిళలు పై ఎందుకు పెట్టాలి. ఈ ప్రభుత్వం,పోలీసువాళ్ళు అమరావతి రైతులపై ఈ చట్టాలు వాడటం అన్యాయం. ప్రజాస్వామ్యంలో హక్కులను కాలరాస్తున్నారు. శుక్రవారం హైకోర్టు తుది తీర్పులో ఛీఫ్ సెక్రటరీ, కలెక్టర్లు, డిజిపి, ఎస్పీలు హాజరవ్వాల్సి వస్తుంది. సెక్షన్ 144 తొలగిస్తే రైతులకు ఊరట లభిస్తుందని అయన అన్నారు. అమరావతి ఆందోళనలు ఉదృతం చెయ్యవచ్చు. ప్రభుత్వం రాజధాని అమరావతి ఒకటే అనే వరకు ఈ పోరాటం ఆగదు. జగన్ మెంటర్ కేసీఆర్ ని కలిశారు,ఆరుగంటలు ఏకాంత సమావేశం అయ్యారని అన్నారు.  మూడు గంటలపాటు ఏమి మాట్లాడుకున్నారో తెలియపరచలేదు. అమరావతి ని ముడుముక్కలు చేస్తున్నారని హరీశ్ రావు, రేవంత్ మాటలను బట్టి చూస్తే అర్ధమవుతుంది. అమరావతి మూడు రాజాధానుల ప్రకటన వల్ల హైదరాబాద్ చాలా సంతోషం గా ఉందని అయన అన్నారు.  మూడు ముక్కలు చేసిన తరువాత హైదరాబాద్ డవల్మెంట్ బాగా పెరిపోతుందని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారని అయన అన్నారు. హైదరాబాద్ నుండి అమరావతి కి దూరం తక్కువ. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రావాళ్లు వచ్చి అమరావతి లో పెట్టుబడులు పెడుతున్నారని కుట్ర చేస్తున్నారని తెలుస్తుంది. ఎలక్షన్ టైం లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తుంది. అమరావతి పతనాన్ని కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నాడు జగన్ అని అయన ఆరోపించారు. రాజధాని మూడు ముక్కలు చెయ్యడం,తెలంగాణాకి ఎంతో బాగుంటుంది. *అమరావతి గురించి ఇద్దరు సీఎం లు మాట్లాడకుండా, తెలంగాణా ప్రాజెక్టులగురించి మాట్లాడుకున్నారు. పోలవరం, అమరావతి గురించి మర్చిపోయి, మిగతా వాటి గురించి మాట్లాడతారు. జగన్ సీఎం గా ఉన్నంత వరకు తెలంగాణాకే లాభం, మంచి రోజులు. జగన్ సీఎం గా వున్నంతకాలం ఆంద్రప్రదేశ్ కి చెడు రోజులేనని జయదేవ్ అన్నారు.

Related Posts