YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమిటీ రిపోర్టులు కాల్చడం దుర్మార్గం

కమిటీ రిపోర్టులు కాల్చడం దుర్మార్గం

కమిటీ రిపోర్టులు కాల్చడం దుర్మార్గం
తాడేపల్లి జనవరి 14 
భోగమంటల్లో జగన్  ఫోటోలు, బోస్టన్ కమిటి, జిఎన్ రావు కమిటి రిపోర్ట్ లు వేయడం దుర్మార్గమని వైకాపా నేత, మాజి ఎంఎల్ ఏ  ఆమంచి కృష్ణమోహన్ ఆరోపించారు. వాటిని భోగమంటల్లో వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అవి ప్రభుత్వ రికార్డులలో పదిలంగా ఉన్నాయి. ప్రభుత్వంనుంచి చంద్రబాబు ఏవైతే ఇన్సెంటివ్స్ పొందారో ఆ డాక్యుమెంట్స్ ను,ఆయన అక్రమాల తాలూకా డాక్యుమెంట్స్ ను తగులబెడితే బాగుండేది. చంద్రబాబు బ్లాక్ మనీ వైట్ గా మార్చడం కోసం పెట్టిన హెరిటేజ్ కంపెనిని పెట్టారు.దానిని ఫ్యూచర్ గ్రూప్ కు విక్రయించారు.వాటి డాక్యుమెంట్స్ తగులబెడితే బాగుండేది.ఆస్దులు ప్రభుత్వానికి చెందేవని అన్నారు. ఇక జగన్  రాష్ర్టంలోని ప్రతి ఒక్కరి హృదయాలలో ఉన్నారనేది చంద్రబాబు అండ్ కో గుర్తించాలి. హైద్రాబాద్ లో పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు తనపై ఉన్న కేసు కారణంగా హడావుడిగా తరలించారు. రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు బినామిలతో భూములు కొనుగోలు చేయించారు. రాజధానిలో మీ మంత్రులు.ఎంఎల్ ఏలు అనుయాయులు చేసిన దోపిడి,దుర్మార్గాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.మీ కుమారుడుని సైతం ఓడించారు. చంద్రబాబును,తెలుగుదేశం పార్టీని ఇటీవల ఎన్నికలలో ప్రజలు బంగాళా ఖాతంలో కలిపేశారు. రాజధానిగా అమరావతి ప్రకటన రాజ్యాంగవిరుధ్దమని అయన అన్నారు. రాజధానిలో చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ధర్నా చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతించారు. చంద్రబాబు రిఫరెండం అని అంటున్నాడు.ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో ఒక భరోసాతో జగన్ ను గెలిపించారు. మేం మా ఎంఎల్ ఏలను రాజీనామా చేయిస్తే ప్రజలు తీర్పును అగౌరపరిచినట్లు. చంద్రబాబు ఛాలెంజ్ ను  స్వీకరించడానికి సిధ్దంగా ఉన్నామని అయన అన్నారు.

Related Posts