బీసీలకు ప్రత్యేక రాజకీయ పార్టీ
ఆర్.కృష్ణయ్య కు ప్రవాస భారతీయులు విజ్ఞప్తి
డల్లాస్ జనవరి 14
తెలంగాణలో బీసీలకు ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలని ప్రవాస భారతీయులు నేడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు విజ్ఞప్తి చేశారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో ఒక ప్రముఖ హోటల్లో ప్రవాస భారతీయులు సమావేశం ఏర్పాటు చేసి కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. ఆర్ కృష్ణయ్య గత 45 సంవత్సరాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు విద్యా హక్కు కోసం పోరాడి హాస్టళ్ళు, పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి స్కీములు పట్టించడం వల్ల బలహీన వర్గాల విద్యార్థులు చదువుకొని విదేశాలలో ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్థిరపడి అభివృద్ధి చెందుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని, దీన్ని అరికట్టాలంటే బీసీలు ప్రత్యేక రాజకీయ శక్తిగా ఏర్పడాలని ప్రవాస భారతీయులు కృష్ణయ్యను కోరారు. 72 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా తెలుగు రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రి కాలేదు. తెలంగాణ ప్రజలులో బీసీ వాదం బలంగా ఉంది. ప్రచార సాధనాలు బీసీ నాయకత్వం ఎదగకుండా అణిచి పెడుతుందని వారు అభిప్రాయపడ్డారు. బీసీలు రాజకీయ పార్టీ పెడితే అమెరికాలోని తెలుగువారoతా పూర్తి మద్దతు ఇస్తామన్నారు. తెలుగు రాష్ట్రంలో కృష్ణయ్య విపరీత అభిమానులు ఉన్నారు. అమెరికాలో కూడా కృష్ణయ్యకు పెద్ద ఎత్తున అభిమానులు ఏప్రిల్/మే నెలలో అమెరికా ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తామని, ఆ సమావేశానికి రావాలని కృష్ణయ్య ను కోరారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గత 45సంవత్సరాలుగా బీసీ/ఎస్సీ/ఎస్టీల విద్య, ఉద్యోగ, రాజకీయ హక్కుల కోసం పోరాడి అనేక విజయాలు సాధించడం జరిగింది. ఈ పోరాటాల వలన బలహీన వర్గాల సామాజిక ఆర్థిక జీవన విధానంలో మౌలిక మార్పు జరుగుతుంది. ఇంకా గుణాత్మకమైన పరిమాణాత్మక మైన మార్పు జరగవలసి ఉంది. రాజ్యాధికారంలో బీసీల జనాభా ప్రకారం 50 శాతం వాటా వచ్చినా రోజే మరింత అభివృద్ధి జరుగుతుంది. సామాజిక ఆర్థిక సమానత్వం జరుగుతుంది అందుకోసం చట్టసభలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారన్నారు. భారతదేశంలో బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ లతోపాటు, సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ/ఎస్టీ యాక్ట్ మాదిరిగా బీసీ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాధికారంలో వాటా సాధించేవరకు బిసి ఉద్యమం ఉధృతం చేస్తామని కృష్ణయ్య అన్నారు.